చెవిపోగులు తాకట్టు పెట్టింది.. కట్ చేస్తే కటిక పేదరికం నుండి పెద్ద ధనవంతురాలు అయ్యింది
అదృష్టం ఉండాలే కానీ అర నిమిషంలో ఐశ్వర్యవంతులైపోతారు. దీనికి పేద, ధనిక అనే భేదం ఉండదు. అదృష్టం తలుపు తడితే జీవితం రాత్రికిరాత్రే మారిపోతుంది. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన మహేశ్వరి సాహ్ని విషయంలో ఇదే జరిగింది. ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆమెకు ఏకంగా రూ.3 కోట్ల లాటరీ తగిలింది. దీంతో ఆమె కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.
అదృష్టం ఉండాలే కానీ అర నిమిషంలో ఐశ్వర్యవంతులైపోతారు. దీనికి పేద, ధనిక అనే భేదం ఉండదు. అదృష్టం తలుపు తడితే జీవితం రాత్రికిరాత్రే మారిపోతుంది. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన మహేశ్వరి సాహ్ని విషయంలో ఇదే జరిగింది. ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆమెకు ఏకంగా రూ.3 కోట్ల లాటరీ తగిలింది. దీంతో ఆమె కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. జాగ్రాన్ గ్రామానికి చెందిన మహేశ్వరిది నిరుపేద కుటుంబం. పెళ్లయిన కొంత కాలానికే భర్త వదిలేయడంతో కష్టపడి పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. కొడుకు కూడా చనిపోవడంతో కూతురితో కలిసి పుట్టింట్లో ఉంటోంది. ఇలాంటి కష్టాల నడుమ ఆమె జీవితంలో లాటరీ రూపంలో అదృష్టం వరించింది. ఈ సందర్భంగా మహేశ్వరి స్పందిస్తూ… జనవరి 17న నా కూతురి పుట్టినరోజు. తనకోసం బహుమతి కొనడానికి డబ్బుల్లేవు. అదే సమయంలో ఓ అమ్మాయికి లాటరీ తగిలిన వార్త పేపర్‌లో చూశాను. నా కూతురి పేరు మీద టికెట్ కొనాలనిపించింది. నా దగ్గర ఉన్న చెవిపోగులు తాకట్టు పెట్టి రూ.2000తో నాలుగు టికెట్లు కొన్నాను అని వివరించింది. నవంబరు 22న సాయంత్రం తమకు లాటరీ తగిలినట్లు తెలిసిందని, ఆ క్షణాలు తమ జీవితంలో అత్యంత ఆనందకరమైనవని ఆమె చెప్పింది. ఆ వార్త విని మొదట తాను నమ్మలేకపోయానని చెప్పింది. ఈ డబ్బుతో తన కూతురిని బాగా చదివించి, డాక్టర్ కావాలన్న తన కలను నెరవేరుస్తానని మహేశ్వరి తెలిపింది. పేద కుటుంబానికి లాటరీ తగలడం సంతోషంగా ఉందని, అయితే ఆన్‌లైన్ లాటరీల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని లాటరీ షాప్ యజమాని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇలాంటి తాతయ్యలు నూటికో కోటికో ఒక్కరే
కరెంట్ ఆఫీసులో వింత జంతువు..అటవీ సిబ్బంది చూసి..
శబరిమల యాత్రికులకు గుడ్ న్యూస్..! భోజనంలో మార్పు
వృద్ధులకు గుడ్‌న్యూస్..! భారీగా పెరిగిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ కవరేజ్
బంగారం కొంటున్నారా.. బీకేర్‌ఫుల్ తక్కువ క్వాలిటీ బంగారంపై ప్యూరిటీ ముద్ర
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

