Hongkong: అపార్ట్‌మెంట్లలో అగ్నికీలలు పన్నెండు మంది మృతి.. లోపలే చిక్కుకున్న వందలాది మంది
హాంకాంగ్‌లోని థాయ్ పొ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెదురు ఫెన్సింగ్‌కు మంటలు అంటుకోవడంతో ఏడు భవనాలకు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 12 మంది మరణించారు, వందలాది మంది లోపల చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నారు. దట్టమైన పొగతో రెస్క్యూ ఆపరేషన్ క్లిష్టంగా మారింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే.
హాంకాంగ్‌లోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. థాయ్ పొ నగర సమీపంలోని అపార్టుమెంట్ల సముదాయంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటలు ఏడు బిల్డింగ్‌లకు వ్యాపించడంతో మంటల్లో చిక్కుకుని 12 మంది చనిపోయారు. వందలాది మంది చిక్కుకుపోయారు. మృతుల్లో 8 మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. అపార్టుమెంట్ల సముదాయం చుట్టూ వెదురు బొంగులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, దానికి గ్రీన్ నెట్ తగిలించారని, ఆ ఫెన్సింగ్ మంటలు అంటుకుని మొత్తం నాలుగు బ్లాకులకు చుట్టుకున్నాయని అధికారులు తెలిపారు. మంటల్లో కాలిపోయి గ్రీన్ నెట్ జారిపోయిందని చెప్పారు. ఆ నివాస సముదాయంలో 2000 ఇళ్లు ఉండగా అపార్టుమెంట్ల లోపల ఇంకా వందల మంది ఉన్నారని, వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయిని తెలిపారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. హాంకాంగ్ స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.51 గంటల సమయంలో ఈ ఘటనపై అగ్నిమాపక విభాగానికి సమాచారం అందింది. ఈ ప్రమాదాన్ని నం.4 అలారంగా అధికారులు ప్రకటించారు. ఈ అత్యయిక పరిస్థితిని ప్రకటించి భారీ స్థాయిలో ఫైర్ ఇంజిన్లు, సిబ్బందిని మోహరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెవిపోగులు తాకట్టు పెట్టింది.. కట్ చేస్తే కటిక పేదరికం నుండి పెద్ద ధనవంతురాలు అయ్యింది
ఇలాంటి తాతయ్యలు నూటికో కోటికో ఒక్కరే
కరెంట్ ఆఫీసులో వింత జంతువు..అటవీ సిబ్బంది చూసి..
శబరిమల యాత్రికులకు గుడ్ న్యూస్..! భోజనంలో మార్పు
వృద్ధులకు గుడ్‌న్యూస్..! భారీగా పెరిగిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ కవరేజ్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

