AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం

చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం

Phani CH
|

Updated on: Nov 28, 2025 | 4:04 PM

Share

ఇటలీలో సంచలనం సృష్టించిన ఓ మోసపూరిత ఘటన ఇది. ఓ వ్యక్తి చనిపోయిన తన తల్లిలా వేషం వేసుకుని, ఆమె పింఛనును మూడేళ్లుగా అక్రమంగా వసూలు చేశాడు. ఇలా రూ.80 లక్షల ప్రభుత్వ నిధులను కొల్లగొట్టాడు. తన తల్లి మృతదేహాన్ని మమ్మీలా ఇంట్లో భద్రపరిచాడు. చివరికి ఓ రిజిస్ట్రీ ఉద్యోగి అనుమానంతో ఈ మోసం బయటపడింది, నిందితుడిని అరెస్టు చేశారు.

చనిపోయిన తల్లి పింఛను కోసం ఆమె అవతారం ఎత్తిన ఓ మోసగాడిని ఇటలీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. కొన్నేళ్లుగా తల్లి మారువేషంలో దాదాపు రూ. 80 లక్షలను అక్రమంగా ఆ వ్యక్తి ప్రభుత్వం నుంచి కొల్లగొట్టినట్లు బయటపడింది. హారర్‌ చిత్రాన్ని తలపించే ఈ వ్యవహారం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇటలీలోని బోర్గో వర్జీలియోలో నివసించే ఓ 56 ఏళ్ల మంటోవా గతంలో నర్సుగా పనిచేసేవాడు. స్థానిక రిజిస్ట్రీ కార్యాలయంలో తన తల్లి గ్రాజియెల్లా గుర్తింపు కార్డును రెన్యువల్‌ చేసేందుకు వెళ్లిన ప్రతిసారీ తన తల్లిలా కనిపించేందుకు తలకు విగ్గు, పెదవులకు లిప్‌స్టిక్‌, ముఖానికి మేకప్‌, 1970 దశకంలో ఉపయోగించే బ్లౌజు, పొడుగు స్కర్టు, నెయిల్‌ పాలిష్‌, పాతకాలం నాటి చెవిరింగులు ధరించేవాడు. మూడేళ్ల క్రితం ఆ వ్యక్తి తల్లి డాల్‌ ఓగ్లియో మరణించగా ఆ విషయాన్ని చెప్పకుండా ప్రతినెలా ఆమె పెన్షన్‌ను తీసుకునేవాడు. అలా రూ.80 లక్షలు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తన తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా.. మమ్మీలా మార్చి ఇంట్లో భద్రపర్చాడు. అయితే పింఛను కోసం వచ్చిన వృద్ధురాలి రూపంలో ఏదో తేడా ఉన్నట్లు ముందుగా రిజిస్ట్రీ ఉద్యోగి గుర్తించాడు. ఆమె మెడ బలంగా ఉంది. ముఖంలో మడతలు వింతగా ఉన్నాయి. చేతులపైన చర్మం వృద్ధురాలి చర్మంలా లేదు. గొంతులో కొంత ఆడతనం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు మగగొంతు వినిపించేది అని రిజిస్ట్రీ ఉద్యోగి చెప్పినట్లు మేయర్‌ ఫ్రాన్సెస్కో తెలిపారు. పింఛను ఫారాలు నింపాలని పిలిపించి తన తల్లి వేషంలో వచ్చిన వ్యక్తిని అరెస్టు చేసారు. తన నేరాన్ని అతను అంగీకరించినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hongkong: అపార్ట్‌మెంట్లలో అగ్నికీలలు పన్నెండు మంది మృతి.. లోపలే చిక్కుకున్న వందలాది మంది

చెవిపోగులు తాకట్టు పెట్టింది.. కట్ చేస్తే కటిక పేదరికం నుండి పెద్ద ధనవంతురాలు అయ్యింది

ఇలాంటి తాతయ్యలు నూటికో కోటికో ఒక్కరే

కరెంట్‌ ఆఫీసులో వింత జంతువు..అటవీ సిబ్బంది చూసి..

శబరిమల యాత్రికులకు గుడ్‌ న్యూస్‌..! భోజనంలో మార్పు