AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..

ఒకప్పుడు సినీరంగంలో అందం, అభినయంతో ఆకట్టుకున్న సినీతారలు చాలా మంది ఉన్నారు. అప్పట్లో బ్లాక్ బస్టర్ సినిమాలతో మెప్పించిన తారలు.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అందులో మహేశ్వరీ ఒకరు. ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియదు.. కానీ పాతికేళ్ల కిందట ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం ఆమె.

Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..
Maheshwari
Rajitha Chanti
|

Updated on: Nov 30, 2025 | 8:05 AM

Share

తెలుగు సినిమా ప్రపంచంలో ఆమె ఓ సంచలనం. అందం, అభినయంతో కట్టిపడేసింది. అప్పట్లో స్టార్ హీరోలతో అనేక హిట్స్ చేసి తనదైన ముద్ర వేసింది. స్టార్ హీరోకు చెల్లెలు అయినప్పటికీ.. సొంతంగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మహేశ్వరీ. ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి. దాదాపు పాతికేళ్ల కిందట తెలుగులో సెన్సేషన్ అయిన హీరోయిన్. 90’s కిడ్స్ డ్రీమ్ గర్ల్. కరుత్తమ్మ అనే సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన అమ్మాయి కాపురం సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. కానీ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు గులాబీ, పెళ్లి. ఈ రెండు సినిమాలతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన గులాబీ సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఇవి కూడా చదవండి : Amala Paul : ఆ సినిమాలో నటించి తప్పు చేశాను.. అప్పుడు నాకు 17 సంవత్సరాలే.. హీరోయిన్ అమలా పాల్..

ఈ మూవీ తర్వాత తెలుగులో దెయ్యం, మృగం, పెళ్లి, ప్రియరాగాలు వంటి సినిమాలతో అలరించింది. రవితేజ సరసన నీకోసం సినిమాతో మెప్పించింది. బెస్ట్ యాక్ట్రెస్ గా నందీ అవార్డ్ గెలుచుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమైన మహేశ్వరీ.. 2008లో శివకాశి అనే ఇంజినీర్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఫ్యామిలీకి టైమ్ కేటాయించింది. అయితే మహేశ్వరీ కూతురు సైతం తెలుగులో క్రేజీ హీరోయిన్. అయితే ఆమె సొంత కూతురు కాదు.. నిజానికి మహేశ్వరీ.. తెలుగు హీరోయిన్ శ్రీదేవికి చెల్లెలు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగులో క్రేజీ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : Actress : 50 సినిమాల్లో హీరోయిన్.. ఒక్కరోజులోనే కెరీర్ క్లోజ్.. అసలేం జరిగిందంటే..

ధడక్ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీలో అనేక చిత్రాల్లో నటించిన జాన్వీ.. ఇప్పుడు తెలుగులో బిజీగా మారిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇప్పుడు రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తుంది. ఇందులో అచ్చియమ్మ పాత్రలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి : Serial Actress : సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది.. కట్ చేస్తే.. సీరియల్స్‏లో విలన్ అయ్యింది.. గ్లామర్ క్వీన్ రా బాబూ..

'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..