Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..
ఒకప్పుడు దక్షిణాది సినీరంగంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. అప్పట్లో కథానాయికగా నటించిన ఆమె.. ఇప్పుడు సహాయ నటిగా సెటిల్ అయ్యింది. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తుంది. ప్రస్తుతం ఆమె వయసు 52 సంవత్సరాలు. ఇప్పటికీ సింగిల్ గానే ఉంటుంది.

దక్షిణాది చిత్రపరిశ్రమలో 1990లలో అందం, అభినయంతో కట్టిపడేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి ఒకరు. ఆమె అప్పట్లో కుర్రాళ్ల కలల అమ్మాయి. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషలలో స్టార్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సహజ సౌందర్యం, ప్రతిభావంతులైన నటనతో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి పేరు సితార. ఒకప్పుడు క్రేజీ హీరోయిన్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు. ప్రస్తుతం ఆమె వయసు 52 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది.
1986లో మలయాళ చిత్రం కావేరితో సితార నటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన ఈ చిత్రం ఆమెకు గొప్ప పరిచయాన్ని ఇచ్చింది. దర్శకుడు కె. బాలచందర్ చిత్రం పుదుపుతు అర్థంగల్ తో సితార తమిళంలో అడుగుపెట్టింది. ఆ చిత్రంలో కనిపించిన కేలడి కన్మణి అనే ఒకే ఒక్క పాట ఆమెను మరింత పాపులర్ చేసింది. తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాల్లో నటించింది. సితారకు ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని కలలు ఉండేవట. కానీ ఆకస్మాత్తుగా తండ్రి చనిపోవడంతో ఆమె జీవితం తలకిందులైంది. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యత మొత్తం సితార భుజాలపై వేసుకుంది.
తండ్రి కోరిక తీర్చడానికి, ఆమె తన తమ్ముడిని చదివించి డాక్టర్‌ను చేసింది. ఈ కుటుంబ బాధ్యతల మధ్య ఆమె పెళ్లికి దూరంగా ఉండిపోయింది. ఒకప్పుడు హీరోయిన్ గా బిజీగా ఉన్న సితారకు ఆ తర్వాత అవకాశాలు సైతం తగ్గిపోయాయి. దీంతో ఆమె సహాయ నటిగా మారింది. సినిమాలతోపాటు సీరియల్స్ సైతం చేసింది. ఇప్పటికీ సినిమాల్లో పలు పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటుంది.

Sithara News
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..




