Bigg Boss 9 Telugu: అరెరే.. లెక్క మారింది భయ్యా.. రీతూ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ ఫీక్స్..
ఈవారం ఊహించని ఎలిమినేషన్ జరిగింది. మొదటి వారం నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా టాస్కులలో అదరగొట్టిన రీతూ.. ఇప్పుడు ఊహించని విధంగా బయటకు వచ్చింది. దీంతో ప్రస్తుతం బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ నెట్టింట సరికొత్త చర్చ నడుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 5 12వ వారం సైతం ముగిసింది. మరికొన్ని రోజుల్లోనే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగనుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే… ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ రేసులో పోటా పోటీ నెలకొంది. ముందు నుంచి సీరియల్ బ్యూటీ తనూజ అత్యధిక ఓటింగ్ తో మొదటి స్థానంలో దూసుకుపోతుంది. ఆమె తర్వాత మొన్నటి వరకు ఇమ్మాన్యూయేల్ పేరు వినిపించింది. మొదటి నుంచి వీరిద్దరికి పాజిటివ్ ఓటింగ్ నెలకొంది. ఇక ఇప్పుడు తనూజకు గట్టి పోటీ ఇస్తూ విన్నర్ రేసులో దూసుకుపోతున్నాడు కళ్యాణ్.
ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ షోలో.. ఈ వారం ఊహించని ఎలిమినేషన్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రచారం జరిగింది. ప్రస్తుతం హౌస్ లో సంజన, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, భరణి శంకర్, రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్, తనూజ, కళ్యాణ్ ఉన్నారు. ఇక వీరిలో ఎవరు ఉన్నా లేకపోయినా.. కళ్యాణ్, తనూజ, ఇమ్మానుయేల్ టాప్ 5లో ఉంటారనేది పక్కాగా ఫిక్స్ అయ్యింది. అయితే వీరిలో టైటిల్ విన్నర్ ఎవరనేది ఊహించడం కాస్తా కష్టమే అనుకోండి.
ఈవారం హౌస్ నుంచి సంజన, సుమన్ శెట్టి బయటకు వచ్చే ఛాన్స్ ఉందని ముందు నుంచి ప్రచారం జరిగింది. ఓటింగ్ ప్రకారం చూసుకున్నప్పటికీ సుమన్ శెట్టి లీస్ట్ ఓటింగ్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు అనుహ్యాంగా రీతూ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని.. అలాగే ఆ వీకెండ్ మరోకరిని బయటకు పంపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న టాక్ ప్రకారం.. కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, భరణి శంకర్ టాప్ 5లో పక్కాగా ఉంటారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..




