Renu Desai: ప్రతి ఒక్కరూ ఈ మూవీని చూడాలి.. ఆ స్టార్ హీరో సినిమాపై రేణూ దేశాయ్ ప్రశంసల వర్షం
గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది రేణూ దేశాయ్. అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. అయితే 2023 లో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిందీ అందాల తార. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆమె మళ్లీ ఇప్పుడు తన తర్వాతి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండే రేణూ దేశాయ్ తాజాగా ఓ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ మూవీని చూడాలని కోరింది. ఇంతకీ రేణూ దేశాయ్ మనసుకు నచ్చిన ఆ మూవీ ఏదనుకుంటున్నారా? ప్రస్తుతం బాలీవుడ్ లో మార్మోగుతోన్న ఆ సినిమా పేరు ‘ధురంధర్’ . దేశ భక్తి నేపథ్యంలో స్పై థ్రిల్లర్ గా తెరకక్కిన ఈ మూవీలో రణ్ వీర్ సింగ్ హీరోగా నటించాడు. నాన్న మూవీ ఛైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ ఇందులో హీరోయిన్ గా నటించింది. అలాగే మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి విడుదలైన ‘ధురంధర్’ సినిమా ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేస్తోంది. విడుదలైన మూడు రోజల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమాపై పలువురు ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ కూడా ధురంధర్ సినిమాను వీక్షించింది. అనంతరం సినిమాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
‘ ప్రతి ఒక్క భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా ధురంధర్. దర్శకుడు ఆదిత్య ధర్ ఒక బ్రిలియంట్ మాస్టర్‌పీస్ ఇచ్చాడు. మనల్ని రోజూ క్షేమంగా ఉంచడానికి ఇండియన్ ఆర్మీ, మన రక్షణ దళాలు 24×7 కష్టపడుతున్నారు. వాళ్ల వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. ఈ సినిమా చూస్తే ఆ విషయం మరింత లోతుగా అర్థమవుతుంది. ఇకనైనా కొందరు ‘సూడో సెక్యులర్స్’ గా తయారై, దేశం మీద మాట్లాడే హక్కు లేదని నిరూపించుకుంటూ తిరిగే వాళ్లు ఈ సినిమా చూడాలి. కనీసం కొంచెం అయినా దేశం పట్ల గౌరవం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ మన దేశం పక్షాన నిలబడాల్సిన సమయం ఇది’ అని రేణు దేశాయ్ రాసుకొచ్చారు. రేణూ దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ధురంధర్ సినిమాపై రేణూ దేశాయ్ రివ్యూ..
View this post on Instagram
ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పుడు ‘ధురంధర్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఇప్పటివరకు 148 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








