Akhanda 2 : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. అఖండ 2 రిలీజ్ డేట్ చెప్పిన మేకర్స్..
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ‘అఖండ 2’ .ఈ మూవీ విడుదలపై నెలకొన్న సందిగ్ధతలు తొలగిపోయాయి. దీంతో తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. అసలు ఈ చిత్రం డిసెంబర్ 5న పాన్ ఇండియా రీలీజ్ కావాల్సి ఉండగా, ఫైనాన్స్ సమస్యల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు అఖండ మేకర్స్. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ 2 సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ముందు నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారమే ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ‘అఖండ 2’ విడుదలపై నెలకొన్న సందిగ్ధతలు తొలగిపోయాయి. నిజానికి ఈ చిత్రం డిసెంబర్ 5న పాన్ ఇండియా రీలీజ్ కావాల్సి ఉండగా, ఫైనాన్స్ సమస్యల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నో ఆశలతో థియేటర్లకు చేరుకున్న అభిమానులు వెనుదిరిగారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఫైనాన్సియల్ సమస్యలు తగ్గడంతో ఈ చిత్రాన్ని డిసెంబర్ 12నే కొత్త రిలీజ్ డేట్‌గా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబో సింహా, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లను అందించింది. వారి నాల్గవ కొలాబరేషన్ వస్తున్న సినిమా కావడం, ముఖ్యంగా బాలకృష్ణ వరుసగా నాలుగు హిట్లను సాధించడంతో అఖండ2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మరింత బజ్ పెంచింది. సనాతన హైందవ ధర్మం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం మాస్, యాక్షన్, డివైన్ ఎలిమెంట్స్ తో గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..
హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఈ చిత్రంలో అద్భుతమైన ఎమోషన్స్ ఉండబోతున్నాయి, ముఖ్యంగా కథనాన్ని నడిపించే మనసుని హత్తుకునే మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులకు మంచి ఎమోషన్ అందించబోతుంది. ప్రేక్షకులు బాలకృష్ణను మూడు విభిన్న గెటప్‌లలో చూడబోతున్నారు, ఇది మరింత ఉత్సాహాన్ని జోడిస్తోంది. ఎస్ థమన్ సంగీతం మరో మెయిన్ హైలైట్, ఇది సినిమా ఎనర్జీ, గ్రాండియర్ ని పెంచుతుంది. సంయుక్త కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
All set for the Divine Destruction at the box office 🔥
Feel the MASSive power of #Akhanda2 in theatres from 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟏𝟐 with grand premieres on December 11th 💥🔱
BOOKINGS OPEN SOON!#Akhanda2Thaandavam‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu… pic.twitter.com/LVmTNIObEr
— 14 Reels Plus (@14ReelsPlus) December 9, 2025
ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..




