AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ! ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. లబ్ధిదారులకు రేషన్ సరఫరా విషయంలో మరోసారి సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు పంపంది. దేశంలో ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్న్టు పేర్కొంది.

Telangana: లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ! ఎప్పుడంటే?
Telangana Ration Distribution
Anand T
|

Updated on: Mar 05, 2026 | 12:41 PM

Share

వేసవి కాలం ప్రారంభమైంది. అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రేషన్‌ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు లబ్దిదారులకు ఒకేసారి 3 నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ అధికారులు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్ర ఆదేశాలతో ఒకే సారి 3 నెలల సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అయితే ప్రస్తతం దేశంలోని ఏ రాష్ట్రంలోని లేని విధంగా కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఒక్కో రేషన్ కార్డు లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులను కూడా అందజేసింది. దీంతో రాష్ట్రంలో రేషన్ కార్డు దారుల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోటికిపైగా రేషన్ కార్డు దారులు ఉన్నారు. అయితే వీరందరికి ఒకే సారి మూడు నెలల రేషన్ ఇవ్వాలంటే భారీ మొత్తంలో దాన్యం నిల్వలు కావాల్సి ఉంటుంది. కాబట్టి రేషన్ పంపిణీకి సరిపడా బియ్యం కోటా నిలువలు, సాధ్యాసాధ్యాలను సర్కార్ పరిశీలిస్తోంది.

అయితే ప్రభుత్వం ఒకే సారి 3 నెలల రేషన్ బియ్యాన్ని అందించడం ఇది మొదటి సారి ఏం కాదు. గతంలోనూ ఇలానే ఒక సారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని తెలంగాణ సర్కార్ లబ్ధిదారులకు అందించింది. అయితే అప్పుడు లబ్ధి దారులతో పాటు, రేషన్ డీలర్లు సైతం కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. ఒకే సారి ఎక్కువ మొత్తంలో స్టాక్ రావడంతో నిల్వ చేసేందుకు స్థలం లేక డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి తోడు సర్వర్ సమస్యలు కూడా డీలర్లు ఎదుర్కొన్నారు. కాబ్టటి మరోసారి ఇదే తరహాలో రేషన్ అందించాలని కేంద్రం నుంచి దేశాలు రావడంతో గతంలో ఎదురైన సమస్యలను అదిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మెగాస్టార్ కంటే ముందే ఎంట్రీ..! చిరంజీవి తండ్రి నటించిన మూవీస్
మెగాస్టార్ కంటే ముందే ఎంట్రీ..! చిరంజీవి తండ్రి నటించిన మూవీస్
ఇంటర్‌ పరీక్షల్లో ఒక్కరోజే 16 మంది విద్యార్ధులు మాల్‌ప్రాక్టీస్‌
ఇంటర్‌ పరీక్షల్లో ఒక్కరోజే 16 మంది విద్యార్ధులు మాల్‌ప్రాక్టీస్‌
తనకన్నా 25ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్.!!
తనకన్నా 25ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్.!!
లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ!
లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ!
ఈ ఒక్క రెసిపితో జుట్టు రాలడానికి చెక్ పెట్టండి !!
ఈ ఒక్క రెసిపితో జుట్టు రాలడానికి చెక్ పెట్టండి !!
అందాన్నిపెంచే మటన్ బుడం దోసకాయ కూర.. ఇలా చేస్తే లాగిస్తూనే ఉంటారు
అందాన్నిపెంచే మటన్ బుడం దోసకాయ కూర.. ఇలా చేస్తే లాగిస్తూనే ఉంటారు
వాడ్ని నమ్మి ఎలా వచ్చావమ్మా.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
వాడ్ని నమ్మి ఎలా వచ్చావమ్మా.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా
కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా
జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది
జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది
ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ రూల్స్., త్వరలోనే మారనున్న నిబంధనలు
ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ రూల్స్., త్వరలోనే మారనున్న నిబంధనలు