AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి నుంచి బిడ్డకు HIV రాకుండా అడ్డుకోవడంలో సక్సెస్.. రికార్డుకెక్కిన డెన్మార్క్..

తల్లి నుంచి బిడ్డకు HIV వ్యాధులు సోకకుండా అడ్డుకోవడంలో డెన్మార్క్ సక్సెస్ అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. యూరోపియన్ యూనియన్‌ లోనే ఈ రికార్డు సాధించిన మొదటి దేశంగా డెన్మార్క్ నిలిచింది.

తల్లి నుంచి బిడ్డకు HIV రాకుండా అడ్డుకోవడంలో సక్సెస్.. రికార్డుకెక్కిన డెన్మార్క్..
Pregnant Woman
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Mar 05, 2026 | 12:54 PM

Share

తల్లి నుంచి బిడ్డకు HIV వ్యాధులు సోకకుండా అడ్డుకోవడంలో డెన్మార్క్ సక్సెస్ అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. యూరోపియన్ యూనియన్‌లోనే ఈ రికార్డు సాధించిన మొదటి దేశంగా డెన్మార్క్ నిలిచింది. కొన్నేళ్లుగా డెన్మార్క్ ప్రభుత్వం అమలు చేసిన పటిష్టమైన ఆరోగ్య విధానాల వల్ల ఇది సాధ్యమైంది. గర్భిణీ స్త్రీలకు ముందస్తు పరీక్షలు నిర్వహించడం, వ్యాధి ఉన్నట్లు తేలితే తక్షణమే మెరుగైన చికిత్స అందించడం ద్వారా శిశువులకు ఈ ప్రాణాంతక వ్యాధులు సోకకుండా డెన్మార్క్ అడ్డుకోగలిగింది. ఫిబ్రవరి 27, 2026న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.

డెన్మార్క్ సాధించిన ఈ విజయం ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచి అని WHO పేర్కొంది. తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ, సిఫిలిస్ వ్యాప్తిని నిర్మూలించడం అనేది కేవలం ఆరోగ్య విజయం మాత్రమే కాదు.. అది మానవ హక్కుల విజయం కూడా అని ఆ సంస్థ ప్రశంసించింది. సాధారణంగా హెచ్‌ఐవీ లేదా సిఫిలిస్ ఉన్న గర్భిణీ స్త్రీల నుంచి పుట్టబోయే బిడ్డకు ఆ వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కానీ, సరైన సమయంలో Antiretroviral Therapy తో పాటు మెరుగైన వైద్య సేవలు అందిస్తే ఈ ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

డెన్మార్క్ ఇదే సూత్రాన్ని పక్కాగా అమలు చేసి చూపెట్టింది. ఇప్పటికే క్యూబా, థాయిలాండ్ వంటి కొన్ని దేశాలు ఈ జాబితాలో ఉన్నప్పటికీ, యూరోపియన్ యూనియన్‌ నుంచి ఈ ఘనత సాధించిన దేశం మాత్రం డెన్మార్క్ కావడం విశేషం.. భారత్ వంటి దేశాల్లో కూడా తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమణను అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మరోసారి పేలనున్న వెండి బుడుగ.. ధరలు ఒకేసారి..
మరోసారి పేలనున్న వెండి బుడుగ.. ధరలు ఒకేసారి..
టీ20 వరల్డ్ కప్‌లో పాక్ ఆటగాడి నీచ బుద్ధి
టీ20 వరల్డ్ కప్‌లో పాక్ ఆటగాడి నీచ బుద్ధి
తల్లి నుంచి బిడ్డకు HIV రాకుండా అడ్డుకోవడంలో సక్సెస్..
తల్లి నుంచి బిడ్డకు HIV రాకుండా అడ్డుకోవడంలో సక్సెస్..
నల్ల శనగలతో గుడాలు మాత్రమే కాదండోయ్.. ఇలా తిన్నారంటే అద్భుత‌మైన
నల్ల శనగలతో గుడాలు మాత్రమే కాదండోయ్.. ఇలా తిన్నారంటే అద్భుత‌మైన
మెగాస్టార్ కంటే ముందే ఎంట్రీ..! చిరంజీవి తండ్రి నటించిన మూవీస్
మెగాస్టార్ కంటే ముందే ఎంట్రీ..! చిరంజీవి తండ్రి నటించిన మూవీస్
ఇంటర్‌ పరీక్షల్లో ఒక్కరోజే 16 మంది విద్యార్ధులు మాల్‌ప్రాక్టీస్‌
ఇంటర్‌ పరీక్షల్లో ఒక్కరోజే 16 మంది విద్యార్ధులు మాల్‌ప్రాక్టీస్‌
తనకన్నా 25ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్.!!
తనకన్నా 25ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్.!!
లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ!
లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ!
ఈ ఒక్క రెసిపితో జుట్టు రాలడానికి చెక్ పెట్టండి !!
ఈ ఒక్క రెసిపితో జుట్టు రాలడానికి చెక్ పెట్టండి !!
అందాన్నిపెంచే మటన్ బుడం దోసకాయ కూర.. ఇలా చేస్తే లాగిస్తూనే ఉంటారు
అందాన్నిపెంచే మటన్ బుడం దోసకాయ కూర.. ఇలా చేస్తే లాగిస్తూనే ఉంటారు