AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రీల్ హీరో.. రియల్ పాలిటిక్స్.. ఎన్నికల వేళ రాజకీయ దుమారం రేపుతోన్న ‘TN 2026’..!

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయాలు హెటెక్కాయి. ప్రస్తుతం సినిమా సెటైర్లు, రాజకీయ విమర్శలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన వేళ, ఆయనను లక్ష్యంగా చేసుకుని తీసినట్లుగా భావిస్తున్న 'TN 2026' (తంగ నక్షత్రం 2026) అనే సినిమా ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

రీల్ హీరో.. రియల్ పాలిటిక్స్.. ఎన్నికల వేళ రాజకీయ దుమారం రేపుతోన్న ‘TN 2026’..!
Tn 2026 Controversy
Ch Murali
| Edited By: |

Updated on: Apr 14, 2026 | 3:48 PM

Share

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయాలు హెటెక్కాయి. ప్రస్తుతం సినిమా సెటైర్లు, రాజకీయ విమర్శలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన వేళ, ఆయనను లక్ష్యంగా చేసుకుని తీసినట్లుగా భావిస్తున్న ‘TN 2026’ (తంగ నక్షత్రం 2026) అనే సినిమా ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

ఈ సినిమా టైటిల్ నుంచి మొదలుకొని, అందులోని కథానాయకుడి పాత్ర చిత్రణ వరకు అన్నీ విజయ్‌ని ఉద్దేశించినవే అని కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ‘తంగ నక్షత్రం’ అంటే గోల్డ్ స్టార్ అని అర్థం. సినిమాలో కథానాయకుడి వేషధారణ, నడక, మాటతీరు అచ్చు విజయ్‌ని పోలి ఉండటమే ఈ వివాదానికి ప్రధాన కారణం. సినిమాలో కేవలం రాజకీయాలే కాకుండా, ఒక స్టార్ హీరో వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ సినిమాలో ఒక అగ్ర హీరో రాజకీయ అరంగేట్రం చేయడం, పార్టీ స్థాపించడం, ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్లను వ్యంగ్యంగా చూపించారు. అంతేకాదు ఒక ప్రముఖ నటితో సదరు హీరోకి ఉన్న సంబంధంపై సాగే సన్నివేశాలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. “మొహానికి రంగు వేసుకునే సినిమా వాళ్లకు రాజకీయాలు ఎందుకు?” అంటూ సాగే సంభాషణలు విజయ్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. అటు పార్టీ పెట్టిన తర్వాత సదరు హీరో కోర్టుల చుట్టూ తిరగడం వంటి సీన్లు విజయ్ వాస్తవ జీవిత పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా వెనుక అధికార DMK పార్టీ హస్తం ఉందని టీవీకే పార్టీ నేతలు ఆరోపణలు వినిపిస్తున్నారు. చిత్ర నిర్మాతలు DMKకి సన్నిహితులు కావడంతో, విజయ్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికే ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారని తమిళగ వెట్రి కళగం (TVK) కార్యకర్తలు మండిపడుతున్నారు.

చిత్ర యూనిట్ మాత్రం ఇది కేవలం ప్రస్తుత రాజకీయాలపై తీసిన ఒక కామెడీ సినిమా మాత్రమేనని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని చెబుతోంది. ఏది ఏమైనా, విజయ్ మద్దతుదారులు ఒకవైపు, ప్రత్యర్థులు మరోవైపు థియేటర్లకు క్యూ కడుతుండటంతో ‘‘TN 2026’’ బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్‌గా నిలిచింది. విజయ్ పార్టీ దీనిపై అధికారికంగా ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
స్క్రీన్ పై 'నక్షత్రం'.. రియాలిటీలో 'రాజకీయ' యుద్ధం!
స్క్రీన్ పై 'నక్షత్రం'.. రియాలిటీలో 'రాజకీయ' యుద్ధం!
మాంసాల్లో అందమైనది ఇదే.. యువతకి పిచ్చెక్కిస్తుందిగా..
మాంసాల్లో అందమైనది ఇదే.. యువతకి పిచ్చెక్కిస్తుందిగా..
హైదరాబాద్‌లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు ఈ 3 తప్పులు..
హైదరాబాద్‌లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు ఈ 3 తప్పులు..
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం తినాల్సిన పండ్లు ఇవే
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలం తినాల్సిన పండ్లు ఇవే
రేపట్నుంచే TET 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. అప్లికేషన్ ఫీజు చూశారా?
రేపట్నుంచే TET 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. అప్లికేషన్ ఫీజు చూశారా?
కోనసీమలో మళ్లీ నాటి పెళ్లి.. ఎడ్లబండిపై తరలివచ్చిన పెళ్లికూతురు
కోనసీమలో మళ్లీ నాటి పెళ్లి.. ఎడ్లబండిపై తరలివచ్చిన పెళ్లికూతురు
తల్లి మంటల్లో కాలిపోతుంటే చూస్తూ నిల్చున్న కొడుకు.. కట్‌చేస్తే..
తల్లి మంటల్లో కాలిపోతుంటే చూస్తూ నిల్చున్న కొడుకు.. కట్‌చేస్తే..
ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే మీ ఇంట్లో సిరుల వర్షమే! ముహూర్తాలు
ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే మీ ఇంట్లో సిరుల వర్షమే! ముహూర్తాలు
‘జురాసిక్‌ పార్క్‌' సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్
‘జురాసిక్‌ పార్క్‌' సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్
టైటిల్.. అంత మ్యాజిక్ చేస్తుందా?
టైటిల్.. అంత మ్యాజిక్ చేస్తుందా?