AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Crime: ఇలాంటి పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి..తల్లి మంటల్లో కాలిపోతుంటే..?

సాధారణంగా తల్లి ఆపదలో ఉందంటే కొడుకులు ఏం చేస్తారు.. ప్రాణాలుకు తెగించైనా ఆమెను కాపాడాలని ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడో యువకుడి ప్రమాదవశాత్తు ఇంట్లో మంటలు చెలరేగి అందులో తల్లి సజీవదహనం అయిపోతున్నా.. ఏం పట్టనున్నటూ చూస్తూ ఉండిపోయాడు. కానీ మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేయలేదు. కళ్ల ముందే కన్నతల్లి కాలిపోతున్న కొడుకు పట్టించుకోవడంతో ఈ ఘటనపై అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నారు.

Andhra Crime: ఇలాంటి పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి..తల్లి మంటల్లో కాలిపోతుంటే..?
Ongole Suspicious Death
Fairoz Baig
| Edited By: |

Updated on: Apr 14, 2026 | 5:10 PM

Share

కళ్ల ముందే తల్లి మంటల్లో చిక్కుకుంటే కొడుకు చూస్తూ ఉండిపోయిన ఘటన ఒంగోలు నగరంలోని గద్దలగుంటపాలెంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలు గద్దలగుంట పాలెంలో ఉంటున్న వెంకట రమణమ్మకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు చెన్నైలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. పెద్ద కొడుకు కిషోర్‌ మాత్రం తల్లితోనే ఉంటూ స్థానికంగా మాంసం కొట్టు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా భార్యతో విభేధాల కారణంగా దూరంగా ఉంటున్నాడు.

ఇంట్లో మంచానికే పరిమితమైన తల్లితో ఉంటూ అప్పుడప్పుడు ఆమెతో గొడవ పడుతుండేవాడు కిషోర్. ఒకానొక సమయంలో మతిస్థిమితంలేనట్టు ప్రవర్తిస్తుండేవాడు. అయితే ఇటీవలే ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న కిషోర్.. మంటలు ఇల్లు మొత్తం వ్యాపించడంలో బటయకు వచ్చాడు. కానీ మంచానికి పరితమైన తల్లి మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. అది తెలిసినప్పటికీ కిషోర్ మాత్రం ఆమెను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు.

పైగా మంటల్లో తల్లి సజీవదహం అవుతుంటే ఇంటి బయట నిల్చొనీ మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. గమనించిన స్థానికి ఇంటి వద్దకు చేరుకొని.. ఇల్లు తగలబడుతుంటే ఆర్పకుండా ఏం చేస్తున్నావ్ అని ప్రశ్నించినా ఎలా సమాధానం ఇవ్వలేదు. దీంతో తల్లి వెంకటరమణమ్మ ఆ మంటల్లోనే సజీవదహనం అయిపోయింది. ఇక చివరకు స్థానికులు మంటలార్పగా ఇంట్లో ఉన్న మంచంపై పూర్తిగా కాలిపోయిన స్థితిలో వెంకటరమణమ్మ మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అయితే స్థానికులు మాత్రం కొడుకే ఇంటికి నిప్పు పెట్టి తల్లిని హత్య చేసి ఉంటాడని చెబుతున్నారు.   అనంరతం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మతిస్థిమితం లేకుండా ప్రవర్తించే కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనే కావాలని ఇంటికి నిప్పు పెట్టాడా.. లేక ప్రమాదావశాత్తూ జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us