Gas Cylinder Expiry Date: తీవ్రమైన గ్యాస్ కొరతతో పాత సిలిండర్ల వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లకు గడువు తేదీ ఉంటుందని, దానిని తనిఖీ చేయడం చాలా అవశ్యకమని అధికారులు తెలియజేస్తున్నారు. గడువు ముగిసిన సిలిండర్ల వల్ల లీక్‌లు, మంటలు, పేలుళ్ల వంటి ప్రమాదాలు జరగవచ్చు. మీ ఇంట్లోని సిలిండర్ గడువు తేదీని వెంటనే తనిఖీ చేసుకోండి.