AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywod: టాలీవుడ్‌లోకి మిస్ యూనివర్స్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది.. హీరో ఎవరో తెలుసా?

జైపూర్‌కు చెందిన ఈ బ్యూటీ గతేడాది మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ను గెలుచుకుంది. అంతకు ముందు 2024 నవంబర్ 16న మెక్సికోలో జరిగిన మిస్ యూనివర్స్ 2024 పోటీలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. టాప్ 30 సెమీ-ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచింది. అలాగే మిస్ టీన్ ఎర్త్ 2023 టైటిల్‌ను కూడా గెలుచుకుందీ అందాల తార.

Tollywod: టాలీవుడ్‌లోకి మిస్ యూనివర్స్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది.. హీరో ఎవరో తెలుసా?
Jetlee Movie
Basha Shek
|

Updated on: Dec 11, 2025 | 6:30 AM

Share

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. మేకర్స్ ముందుగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సత్య ఒక విమానం పైన కూర్చుని “I am done with comedy”అని ప్రజెంట్ చేయడం హిలేరియస్ అనిపించింది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ చిరంజీవి (చెర్రీ) , హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్న జెట్లీని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. భారీ బ్యానర్లు చేతులు కలపడంతో ఇది స్కై-లెవెల్ ఎంటర్టైనర్ రాబోతుందనే విషయం స్పష్టమవుతోంది. జెట్లీ తో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. రియా సింఘాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఈరోజు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఆమెను స్టైలిష్ యాక్షన్ అవతార్‌లో ప్రజెంట్ చేసింది. విమానం లోపల మండుతున్న పేలుడు మధ్య, చేతిలో తుపాకీ పట్టుకొని కనిపించడం ఆకట్టుకుంది. ఎగిరే శిథిలాలు, పగిలిపోయిన వస్తువులు , డ్రమటిక్ లైటింగ్ ఆమె చుట్టూ ఉన్న ఇంటెన్స్ బ్యాక్ డ్రాప్ ని చూపిస్తోంది. మొత్తం లుక్ బోల్డ్, పవర్‌ఫుల్‌గా ఉంది. ఆమె కమాండింగ్ యాక్షన్ హీరోయిన్‌గా కనిపించబోతోంది.

రానా అద్భుతమైన నేరేషన్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ విజన్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యాకింగ్… అన్నీ కలిసి ‘జెట్లీ’ అద్భుతమైన ఎంటర్‌టైనర్‌ కానుంది. వెన్నెల కిషోర్, అజయ్ ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రితేష్ రానా గత హిట్లకు పని చేసిన కోర్ టెక్నికల్ టీం ఈ సినిమాకి వర్క్ చేస్తుంది. సంగీతం కాల భైరవ, సినిమాటోగ్రఫీ సురేష్ సరంగం, ఎడిటింగ్ కార్తిక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైన్ నార్ని శ్రీనివాస్. రితేష్ రానా సిగ్నేచర్ ఎంటర్టైన్మెంట్. క్లెవర్ రైటింగ్, యూనిక్ క్యారెక్టర్స్ తో జెట్లీ అలరించబోతుంది.

ఇవి కూడా చదవండి

జెట్లీ సినిమా నుంచి రియా సింఘా ఫస్ట్ లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.