- Telugu News Photo Gallery Cinema photos Srinivasa Kalyanam At Producer Bandla Ganesh House, See Photos
Bandla Ganesh: బండ్ల గణేశ్ ఇంట్లో శ్రీనివాస కల్యాణం.. తరలివచ్చిన సినీ ప్రముఖులు.. ఫొటోస్ ఇవిగో
టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇంట్లో శ్రీనివాస కల్యాణం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబీకులు, బంధువులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
Updated on: Dec 11, 2025 | 10:16 PM

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇప్పుడేమీ సినిమాలు చేయడం లేదు. అయితే ఇతర విషయాలు, వివాదాస్పద కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు బండ్లన్న.

ఈ మధ్యన తరచూ సినిమా ఫంక్షన్లకు, సక్సెస్ ఈవెంట్లకు బాగానే హాజరవుతోన్న బండ్లన్న తన హాట్ కామెంట్స్ తో తరచూ ట్రెండింగ్ లో నిలుస్తున్నాడు.

వీటి సంగతి పక్కన పెడితే.. ఈ మధ్యన దీపావళి పండగను పురస్కరించుకుని టాలీవుడ్ ప్రముఖులందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు బండ్ల గణేశ్. మెగాస్టార్ చిరంజీవితో సహా స్టార్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తాజాగా బండ్ల గణేశ్ ఇంట్లో శ్రీనివాస కల్యాణం వేడుకగా జరిగింది. వేద పండితుల సమక్షంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ వేడుకకు బండ్లన్న కుటుంబీకులు, బంధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

అలాగే స్రవంతి రవి కిషోర్ తో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ శ్రీనివాస కల్యాణం వేడుకలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

కాగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న బండ్ల గణేశ్ త్వరలోనే మళ్లీ సినిమాలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే అతను ఒక శుభవార్త చెప్పనున్నట్లు టాక్.




