- Telugu News Photo Gallery Cinema photos Actress Kushitha Kallapu Interesting Comments About Her Movies
Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..
ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తాజాగా ఓ యంగ్ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. బోల్డ్ సీన్స్ గురించి మాట్లాడిన ఈ అమ్మడు.. లిప్ లాక్ సీన్స్ మాత్రం చేయనుంటుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసుకుందామా.
Updated on: Dec 11, 2025 | 8:56 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఈ అమ్మడు ఒకరు. తెలుగు అడియన్స్ అందరూ ఆమెను ఎక్కువగా బజ్జీల పాప అని పిలుచుకుటారు. బ్యూటీకి యూత్ లో ఎక్కువగానే ఫాలోయింగ్ ఉంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ కుషిత కల్లపు. 2023లో 'నీతోనే నేను' అనే సినిమాతో సినిరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో చంగురే బంగారు రాజా, మనోహరం వంటి సినిమాల్లో నటించింది. 2024లో బాబు (No.1 బుల్‌షిట్ గై) అనే సినిమాలో కనిపించింది.

ఇటీవలే రాజ్ తరుణ్ సరసన చిరంజీవ చిత్రంలో నటించింది. ప్రస్తుంత 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సిరీస్ ను డైరెక్టర్ మారుతి క్రియేటర్ గా వ్యహరించగా.. SKN నిర్మించారు. మాగీ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది.

బోల్డ్ సీన్స్ చేయడానికి రెడీగా ఉన్నారా అని యాంకర్ అడగ్గా.. లిప్ లాక్ సీన్స్ మాత్రం చేయనని.. బోల్డ్ సీన్స్ చేసేందుకు ఓకే అని చెప్పుకొచ్చింది. లిప్ లాక్స్ కి ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని, తనకి కూడా అలాంటివి చేయడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది.

యానిమల్ సినిమాల్లో తృప్తి చేసిన పాత్రకు ఎంత పేరొచ్చినా తాను మాత్రం అటువంటి క్యారెక్టర్స్ చేయనని అంటుంది. భవిష్యత్తులో ఏదోక రోజు పెళ్లి చేసుకుంటానని.. తన భర్తకు మాత్రమే లిప్ లాక్ ఇస్తానని అంటుంది. '3 రోజెస్' సీజన్-2 డిసెంబర్ 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.




