Samantha-Raj Nidimoru: సమంత భర్త రాజ్‌లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? వైరల్ వీడియో చూశారా?
పెళ్లి వేడుక తర్వాత మళ్లీ ఎవరి ప్రొఫెషనల్ పనుల్లో వారు బిజీ అయిపోయారు సమంత, రాజ్ నిడిమోరు. ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమాతో సమంత బిజీ బిజీగా ఉంటోంది. ఇందులో ఆమె లీడ్ రీల్ పోషించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఇటీవల పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ లో ఉన్న లింగ భైరవి ఆలయంలో వీరి పెళ్లి వేడుకగా జరిగింది. ఈ శుభకార్యానికి అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. కాగా పెళ్లి తర్వాత మళ్లీ తమ తమ ప్రొఫెషనల్ పనుల్లో బిజీ అయిపోయారు సమంత, రాజ్. ఇటీవలే శుభం సినిమాతో నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న ‘సామ్ ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీకి కూడా సామ్ నే నిర్మాతగా వ్యవహరిస్తోంది. మరోవైపు రాజ్ నిడిమోరు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ప్రమోషన్స్ లో బిజీగా ఉంటున్నాడు. కాగా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లతో ఇప్పటికే తన ట్యాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు రాజ్ నిడిమోరు. అయితే లెటెస్ట్ గా అతని గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది. అదేంటంటే.. రాజ్ మంచి డైరెక్టరే కాదు.. మంచి సింగర్ కూడా. కేవలం నామ్ కే వాస్తే మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ సింగర్ తరహాలో రాజ్ పాటలు పాడుతారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా రాజ్ నిడిమోరు చాలా సింపుల్ గా నేలపై కూర్చుని, మహా గణపతి సాంగ్ ను పాడాడు. దీనిని అతని కుటుంబీకులు ఎంతో శ్రద్ధగా ఆలకించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా శ్రావ్యమైన సంగీతంతో ఎంతో మంది సంగీతాభిమానుల మనసులు గెల్చుకున్న శోభ రాజ్ కు స్వయానా పిన్ని అవుతోంది. ఇప్పుడు ఆమె సమక్షంలోనే రాజ్ ఎంతో అద్భుతంగా మహా గణపతి సాంగ్ ను ఆలపించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రాజ్ లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
నెట్టింట వైరలవుతోన్న రాజ్ నిడిమోరు వీడియో ఇదిగో..
View this post on Instagram
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ 3 తో మంచి సక్సెస్ అందుకున్నాడు రాజ్. ముంబై లో సక్సెస్ సెలబ్రేషన్స్ పార్టీ కూడా చేసుకున్నాడు. ఇప్పుడు ఫ్యామలీ మ్యాన్ సీజన్ 4ను తెరకెక్కించేందుకు రాజ్ ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








