Mowgli Movie: ‘మోగ్లీ’ మూవీ డైరెక్టర్ భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్ అని తెలుసా? ఏయే సినిమాలు చేసిందంటే?
కలర్ ఫొటో సినిమాతో టాలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకున్నారు డైరెక్టర్ సందీప్ రాజ్. అంతేకాదు తన దర్శకత్వ ప్రతిభకు ప్రతీకగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు మోగ్లీ మూవీతో ఆడియెన్స్ ను పలకరించేందుకు రెడీ అయ్యాడు. ఇందులో సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్నాడు.

షార్ట్ ఫిల్మ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ రాజ్. తన టేకింగ్ తో బోలెడంత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అదే క్రేజ్ తో 2020లో కలర్ ఫొటో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. సుహాస్, చాందిని చౌదరి హీరో, హీరోయిన్లు గా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ కరోనా కారణంగా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. అయినా సూపర్ హిట్ గా నిలిచింది. దర్శకుడిగా సందీప్ రాజ్ కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక ఇదే సినిమాకు గానూ జాతీయ అవార్డును సైతం అందుకున్నాడీ ట్యాలెటెండ్ డైరెక్టర్. దీని తర్వాత పలు సినిమాల్లో సహాయక నటుడు, విలన్ పాత్రలు పోషించాడు సందీప్ రాజ్. ముఖ్యంగా డాకు మహారాజ్ సినిమాలో సందీప్ పోషించిన పాత్రకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం మోగ్లీ అనే సినిమాతో మళ్లీ ముందుకు వస్తున్నాడు సందీప్ రాజ్. సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా రూపొందిన ఈ మూవీ ఈనెల 12న విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడీ మూవీ అనూహ్యంగా వాయిదా పడేంది. ఒక్కరోజు ఆలస్యంతో శనివారం (డిసెంబర్ 13)న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తన ఎమోషనల్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచాడు సందీప్ రాజ్.
ఇదిలా ఉంటే ఈ క్రేజీ డైరెక్టర్ భార్య కూడా తెలుగులో క్రేజీ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. తాను తెరకెక్కించిన కలర్ ఫొటో సినిమాలోనే ఒక కీలక పాత్రలో మెరిసిన చాందిని రావునే పెళ్లి చేసుకున్నాడు సందీప్ రాజ్.ఈ సినిమా షూటింగ్ లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆపై పెద్దల అనుమతితో గతేడాది నవంబర్ లో తిరుమల ఏడుకొండల వాడి సాక్షిగా ఏడడుగులు నడిచారు. కలర్ ఫొటోతో పాటు సందీప్ రాజ్ కథ అందించిన ‘హెడ్స్ అండ్ టేల్స్’ వెబ్ సిరీస్‌లో ఓ పాత్ర చేసింది చాందినీ రావు. అలాగే ‘రణస్థలి’తో పాటు మరికొన్ని సినిమాల్లోనూ సహాయక నటి పాత్రలు చేసింది.
భార్యతో డైరెక్టర్ సందీప్ రాజ్..
View this post on Instagram
ఇటీవల ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఘటన అనే ఓ మూవీలోనూ చాందినీ రావు యాక్ట్ చేసింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








