AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌కు కింగ్ నాగార్జున మాస్ వార్నింగ్.. ఎందుకో తెలుసా?

నాగార్జున, అనుష్క శెట్టి... ఈ జంటకు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం ఉంది. 'సూపర్' సినిమా ద్వారా నాగార్జుననే అనుష్కను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత 'అరుంధతి' సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్‌గా మారింది. 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ..

Nagarjuna: అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌కు కింగ్ నాగార్జున మాస్ వార్నింగ్.. ఎందుకో తెలుసా?
Nagarjuna Anushka And Director
Nikhil
|

Updated on: Dec 12, 2025 | 10:12 PM

Share

నాగార్జున, అనుష్క శెట్టి… ఈ జంటకు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ‘సూపర్’ సినిమా ద్వారా నాగార్జుననే అనుష్కను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత ‘అరుంధతి’ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్‌గా మారింది. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగింది. అయితే, ‘అరుంధతి’ సినిమా తర్వాత అనుష్క నటించిన సినిమా ‘పంచాక్షరి’ దర్శకుడు సముద్రను నాగార్జున ఒక విషయంలో స్వీట్ వార్నింగ్ ఇచ్చారట! ఇంతకీ నాగార్జున ఏమని వార్నింగ్​ ఇచ్చారు?

స్వీట్ వార్నింగ్..

నాగార్జున, అనుష్క కలిసి పలు సినిమాల్లో నటించారు. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాగార్జున హీరోయిన్‌గా పరిచయం చేయడంతో పాటు, తన దగ్గర పనిచేసేవారిని కూడా చాలా బాగా చూసుకుంటారనే పేరు నాగార్జునకు ఉంది. ఈ విషయాన్ని ‘పంచాక్షరి’ సినిమా దర్శకుడు సముద్ర ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అనుష్కతో సినిమా తీసేటప్పుడు నాగార్జున ఇచ్చిన సలహా లేదా హెచ్చరిక గురించి ఆయన పంచుకున్నారు. ‘అరుంధతి’ సినిమా తర్వాత అనుష్క సినిమాలపై అంచనాలు బాగా పెరిగాయి. ఆ సమయంలో సముద్ర దర్శకత్వంలో వచ్చిన ‘పంచాక్షరి’ సినిమాకు నాగార్జున మేకప్ మెన్‌గా పనిచేసే చంద్ర నిర్మాతగా వ్యవహరించారు.

ఈ సినిమా విషయంపై మాట్లాడటానికి నాగార్జున ఒకసారి సముద్రను గోవాకు పిలిచారట. ఆ సందర్భంలో నాగార్జున, సముద్రతో ఏమన్నారంటే.. ‘శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ‘అరుంధతి’ సినిమా తీశారు. ఆయన పెద్ద నిర్మాత. ఇక్కడ చంద్ర ఉన్నాడు, నా దగ్గర పనిచేస్తాడు. అతను అంత పెద్ద నిర్మాత కాదు. కాబట్టి వీడి లైఫ్ జాగ్రత్త!’అని నాగార్జున చెప్పినట్లు సముద్ర వెల్లడించారు.

Nagarjuna Anushka And Samudra

Nagarjuna Anushka And Samudra

నాగార్జున ఇచ్చిన ఈ వార్నింగ్​ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్‌తో సినిమా తీసేటప్పుడు నిర్మాత అయిన తన మేకప్ మెన్ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, సినిమా బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని దర్శకుడికి నాగార్జున పరోక్షంగా చెప్పారన్నమాట. తన దగ్గర పనిచేసే అతని భవిష్యత్తుపై ఉన్న శ్రద్ధను నాగార్జున ఇలా ప్రదర్శించారు.

అంతేకాదు, అనుష్క తన దగ్గర పనిచేసేవారిని ఎలా చూసుకుంటారో చెప్పడానికి సముద్ర మరో సంఘటనను కూడా పంచుకున్నారు. అనుష్క హీరోయిన్‌గా, సుమంత్ హీరోగా వచ్చిన ‘మహానంది’ సినిమా షూటింగ్ సమయంలో అనుష్క సముద్రకు గోరుముద్దలు పెట్టేవారట. ‘పంచాక్షరి’ సమయంలో కూడా అంతే ప్రేమగా అన్నం తినిపించిందట. అయితే, అనుష్క స్టార్ హీరోయిన్ అయ్యాక కూడా, ఆమె అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ చాలా మంచి అమ్మాయే అన్నారు.