- Telugu News Photo Gallery Cinema photos Do You Know Harshali Malhotra, Who Played Balakrishna Daughter Role In AKhanda 2
Akhanda 2 : అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ? ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్..
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చింది. బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బోయపాటి తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 12న గ్రాండ్ గా విడుదలైంది. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇదెలా ఉంటే.. ఇందులో బాలయ్య కూతురిగా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా.. ?
Updated on: Dec 12, 2025 | 10:11 PM

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందించిన సినిమా అఖండ 2. ఈ చిత్రానికి ముందు నుంచి భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన బీజీఎమ్ అందించారు. ఈ సినిమాలో బాలయ్య కూతురిగా అందరి దృష్టిని ఆకర్షించింది ఓ అమ్మాయి.

అఖండ 2 చిత్రంలో బాలయ్య కూతురు జనని అందరి దృష్టిని ఆకర్షించిన అమ్మాయి ఎవరో తెలుసా.. ? ఆమె ఒకప్పుడు ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్. ఈ అమ్మడు పేరు హర్షాలీ మల్హోత్రా. నిజానికి ఈ సినిమా బాలకృష్ణ కూతురు జనని పాత్ర చుట్టే తిరుగుతుంది. ఆమె ఆపదలో ఉంటే రక్షించడానికి వస్తాడు.

ఆమె పాత్ర సినిమాలో ప్రధానం. అఖండ 2 సినిమాతో హర్షాలీ తెలుగులో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు గురించి తెలుసుకోవడానికి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసుకుందామా.

ఈ అమ్మడు హిందీలో పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన భజరంగీ భాయిజాన్ చిత్రంలో నటించింది. అప్పుడు ఆమె వయసు కేవలం 6 సంవత్సరాలు. ఇందులో మున్ని అనే అమ్మాయి పాత్రలో నటించి అందరి మనసులు దొచుకుంది. ఇప్పుడు అఖండ 2 చిత్రంలో నటించింది.

హర్షాలీ 2008 జూన్ 3న ముంబైలో జన్మించింది. భజరంగీ భాయిజాన్ తర్వాత కుబూల్ హై, లౌట్ అవో త్రిష వంటి సీరియల్స్ చేసింది. ఇప్పుడు 16 ఏళ్ల వయసులో అఖండ 2 సినిమాతో వెండితెరపైకి తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం హర్షాలీ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.




