అందరి ఫోకస్ సంక్రాంతి పైనే.. ఆ హీరోయిన్స్ హిట్ కొడతారా?
సంక్రాంతి అంటేనే సినిమా పండగ.. ఆ సినిమాలతో బాక్సాఫీస్ బద్ధలుకొట్టి ఏడాదంతా గుర్తుండిపోయే విజయం అందుకోవాలని ట్రై చేస్తుంటారు హీరోలు. అలాగే హీరోయిన్స్ కూడా..! కాకపోతే ఈసారి పండక్కి రాబోయే అన్ని సినిమాల్లో హీరోయిన్లకు ఒకే కష్టాలున్నాయి.. అదే ఫ్లాపులు. అందరికీ హిట్టు కావాలి. మరి వాళ్లెవరు..? అందులో ఎంతమందికి హిట్ రాబోతుంది..?
Updated on: Dec 12, 2025 | 3:26 PM

సంక్రాంతి అంటేనే సినిమా పండగ.. ఆ సినిమాలతో బాక్సాఫీస్ బద్ధలుకొట్టి ఏడాదంతా గుర్తుండిపోయే విజయం అందుకోవాలని ట్రై చేస్తుంటారు హీరోలు. అలాగే హీరోయిన్స్ కూడా..! కాకపోతే ఈసారి పండక్కి రాబోయే అన్ని సినిమాల్లో హీరోయిన్లకు ఒకే కష్టాలున్నాయి.. అదే ఫ్లాపులు. అందరికీ హిట్టు కావాలి. మరి వాళ్లెవరు..? అందులో ఎంతమందికి హిట్ రాబోతుంది..?

సంక్రాంతి సినిమా అంటే అందరి ఫోకస్ హీరోలపై ఉంటుంది కానీ అక్కడ హీరోయిన్స్ మధ్య పోటీ కూడా బాగానే ఉంటుంది. 2026 పండక్కి కూడా అదే జరగబోతుంది. ముఖ్యంగా ఈసారి రాబోయే హీరోయిన్స్ అంతా ఫ్లాప్స్‌లో ఉన్నారు. సో.. వాళ్లందరికీ హిట్ కీలకం. అందులో అందరికంటే ముందే చెప్పుకోవాల్సింది నయనతార గురించే

గత కొన్నేళ్లలో నయనతారకు తెలుగులో హిట్టే లేదు. సైరా, ఆరడుగుల బుల్లెట్, గాడ్ ఫాదర్.. ఇవేవీ అంచనాలు అందుకోలేదు. దాంతో ఈమె ఆశలన్నీ ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారూపైనే ఉన్నాయి. మరోవైపు మీనాక్షి చౌదరి ఫ్లాపుల్లో లేకపోయినా.. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మరో సినిమా రాలేదు. మళ్లీ పొంగల్‌కే అనగనగా ఒకరాజుతో వస్తున్నారు ఈ బ్యూటీ.

పండక్కి పక్కా హిట్టు కొట్టాల్సిన లిస్టులో ఉన్న నెక్ట్స్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈమె నటించిన ఏ సినిమా కూడా ఆడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న హరిహర వీరమల్లు సైతం నిరాశ పరిచింది. రాజా సాబ్‌లో ప్రభాస్‌తో జోడీ కట్టారు ఈ బ్యూటీ. దీనిపైనే నిధి ఆశలన్నీ ఉన్నాయి. ఇదే సినిమాతో మాళవిక మోహనన్ సైతం తెలుగులో హిట్ కొట్టాలని చూస్తున్నారు.

ఇక ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీ సైతం సంక్రాంతిపైనే ఆశలు పెట్టుకున్నారు. నా సామిరంగాతో మంచి హిట్ కొట్టిన ఆషికా.. ఆ తర్వాత మళ్లీ కనబడలేదు. ప్రస్తుతం రవితేజతో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఇక డింపుల్ సైతం ఫస్ట్ హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ పండక్కి వీళ్లలో ఎవర్ని విజయం వరిస్తుందో చూడాలి.