AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అయ్యో.. ఎంత కష్టమొచ్చింది.. దీన స్థితిలో టాలీవుడ్ ప్రముఖ నటి.. వృద్ధాశ్రమంలో ఆశ్రయం

ఈ నటి తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. సహాయక నటిగా మెప్పించారు. అలాగే కమెడియన్ గానూ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. సినిమాల్లో ఉన్నప్పుడు ఎంతో లగ్జరీగా జీవించిన ఈ సీనియర్ నటి ఇప్పుడు దీన స్థితిలో జీవితం గడుపుతున్నారు.

Tollywood: అయ్యో.. ఎంత కష్టమొచ్చింది.. దీన స్థితిలో టాలీవుడ్ ప్రముఖ నటి.. వృద్ధాశ్రమంలో ఆశ్రయం
Tollywood Senior Actress
Basha Shek
|

Updated on: Dec 13, 2025 | 6:45 AM

Share

ప్రముఖ నటి వాసుకీ అలియాస్ పాకీజా గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారామె. తమిళనాడుకు చెందిన ఆమె 1991లో మోహన్‌బాబు సినిమా ‘అసెంబ్లీ రౌడీ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. బ్రహ్మానందంకు జోడీగా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. ఆ తర్వాత మేజర్‌ చంద్రకాంత్, పెదరాయుడు, రౌడీగారి పెళ్లాం, బ్రహ్మ, పుణ్యభూమి నాదేశం, రౌడీ ఇన్ స్పెక్టర్ తదితర సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటించిన ఆమె బాగానే డబ్బు సంపాదించారు. అయితే సంపాదించినదంతా పోగొట్టుకుని ఖాళీ చేతులతో, కడుపు మాడ్చుకుంటూ బతికేంత దుస్థితి చేరుకున్నారు. వాసుకీ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, చిరంజీవి, నాగ బాబు, మంచు విష్ణు తదితరులు ఆమెకు ఆర్థిక సాయం చేశారు. అయితే ఇప్పుడామె మళ్లీ రోడ్డున పడ్డారు. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో  డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో నిర్వాహకుడు జల్లి కేశవరావు నటి పాకీజాకు ఆశ్రయం కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన గురువు మోహన్‌బాబు కుటుంబం రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ఆయన తనయుడు మంచు విష్ణు నా పరిస్థితిని చూసి నా కళ్లకు శస్త్రచికిత్స చేయించారు. ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, ఆయన సోదరులు చిరంజీవి, నాగబాబు రూ.4 లక్షల ఆర్థిక సాయం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ నాకు అన్ని విధాలా సహాయపడుతున్నారు. ఆధార్‌ కార్డులో చిరునామా మార్పునకు కేశవరావు సహకరించారు. జిల్లా కలెక్టర్‌.. పింఛనుతోపాటు బియ్యం కార్డు మంజూరు చేస్తే ఆదరువుగా ఉంటుంది. ఇక్కడకు వచ్చినప్పుడు నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు కాస్త మెరుగు పడింది. తెలుగు ప్రేక్షకుల ఆదరణ, ఆప్యాయతలు మరువలేనివి‘ అని వాసుకి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!