Dushara Vijayan: పదేళ్ల క్రితమే చనిపోయింది.. తన ఫోటో చూసి ఇప్పటికీ ప్రార్థిస్తాను.. హీరోయిన్ కన్నీళ్లు..
సౌత్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలో విభిన్న కంటెంట్ కథలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ దుషారా విజయన్. వైవిధ్యమైన పాత్రలు.. సహజ నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 2019లో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది.

దక్షిణాదిలో వైవిధ్యమైన పాత్రలు.. విభిన్న కథలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ దుషారా విజయన్. 2019లో బోదై ఏరి బుద్ది మారి అనే తమిళ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వా్త వరుస అవకాశాలు అందుకుంది. దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కించిన సార్పట్ట పరంపర సినిమాతో ఆమెకు బ్రేక్ వచ్చింది. ఇందులో మరియమ్మ పాత్రలో ఆమె అద్భుత నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అలాగే ధనుష్ నటించిన రాయన్ చిత్రంలోనూ ముఖ్య పాత్ర పోషించింది. తనకు ఛాన్స్ వస్తే తెలుగులోనూ నటించేందుకు రెడీగా ఉన్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు మాట్లాడుతూ తన జీవితంలో నెలకొన్న విషాదం గురించి వెల్లడించింది. గతంలో కోపంలో త్వరితగతిన మాట్లాడేసి, ఇతరులను బాధపెట్టిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. అయితే, కాలక్రమేణా ఆ కోపాన్ని అధిగమించి, ప్రశాంతమైన దృక్పథాన్ని అలవరుచుకున్నట్లు తెలిపారు. ఐదు నిమిషాల కోపం అనే భావన నుండి జరిగిన దాన్ని అంగీకరించి ముందుకు సాగడం అనే పరిపక్వతకు చేరుకున్నానని ఆమె వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..
తన సోదరుడితో ఆమెకున్న అనుబంధం ప్రత్యేకమైనది. “నేను, తమ్ముడు ఒక సెవెన్ ఇయర్స్ చెన్నైలో ఒంటరిగా ఉన్నాము. సో ఐ యామ్ హిజ్ మదర్, టెక్నికల్లీ… హి ఇస్ మై చైల్డ్. సో, నాకు మా తమ్ముడే అన్నీ” అని దుషారా తెలిపారు. వారిద్దరి మధ్య బలమైన అనుబంధం ఉందని, ఏ విషయాన్నైనా తమ్ముడితో పంచుకోగలనని ఆమె అన్నారు. ఏదైనా జరిగితే, తన తమ్ముడు ముందుగా తనకు ఫోన్ చేసి చెబుతాడని, ఇది వారిద్దరి మధ్య ఉన్న అవగాహనను తెలియజేస్తుందని దుషారా పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..
అంతేకాకుండా, తన దివంగత సోదరి గురించి దుషారా భావోద్వేగంగా పంచుకున్నారు. తనకు ముగ్గురు సోదరీమణులు ఉండేవారని, తన రెండో అక్క పదేళ్ల క్రితం కన్నుమూశారని తెలిపారు. ఆమె మయోపతి అనే ఆరోగ్య సమస్యతో బాధపడ్డారని చెప్పారు. తనకి డ్యాన్స్ పట్ల ఆసక్తి కలగడానికి ప్రధాన కారణం తన సోదరి అని దుషారా వెల్లడించారు. “వాళ్ళు నడవలేరు… బట్ షి వాజ్ బోర్న్ లైక్ దట్” అని నాగార్జున ఊపిరి సినిమాలో పాత్రను పోలి ఉండే ఆమె పరిస్థితిని వివరించారు. తన సోదరి వీల్ చైర్‌లో కూర్చుని “దుషీ ఇలా ఆడు, అలా ఆడు” అని తనకు సలహాలు ఇచ్చేవారని, ఆ విధంగానే తనకు డ్యాన్స్ పై ప్రేమ కలిగిందని దుషారా తెలిపారు. తన సోదరిని కోల్పోయినప్పటికీ, ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ తనతో ఉంటాయని, ఇప్పటికీ ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఆమె ఫోటోస్ ముందు ప్రార్థిస్తానని భావోద్వేగంగా చెప్పారు.
తన పెద్ద అక్క ఏరోనాటికల్ ఇంజనీర్ అని, ఆమె ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నారని దుషారా తెలిపారు. ఇక్కడ తనతో ఉంటున్న తన ఇద్దరు మేనల్లుళ్ల గురించి కూడా ప్రస్తావించారు. దుషారా విజయన్ జీవిత ప్రయాణం వ్యక్తిగత సవాళ్లు, భావోద్వేగ ఎదుగుదల, కుటుంబం నుండి పొందిన అపారమైన మద్దతు, స్ఫూర్తికి నిదర్శనం. ఆమె కథ అనేక మందికి ఆదర్శంగా నిలుస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..
దుషారా విజయన్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..
