AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dimple Hayathi: శ్రీకాళహస్తీశ్వరాలయంలో హీరోయిన్ డింపుల్ హయాతి.. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు.. వీడియో

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతీ ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలో ఉంది. వరుసగా ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తూ ప్రత్యేక పూజలు చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుంది. అక్కడి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Dimple Hayathi: శ్రీకాళహస్తీశ్వరాలయంలో హీరోయిన్ డింపుల్ హయాతి.. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు.. వీడియో
Dimple Hayathi
Basha Shek
|

Updated on: Sep 24, 2026 | 9:26 PM

Share

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో కొన్ని చిన్న సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ గద్దలకొండ గణేశ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో ఆమె నటించిన స్పెషల్ సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిందీ అందాల తార. అయితే ఎందుకో స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో హీరోయిన్ గా కనిపించింది డింపుల్. ఇప్పటివరకు తన అందం, డ్యాన్స్ తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా తిరుమలలో తన అద్భుతమైన క్లాసికల్ డ్యాన్స్‌తో భక్తులను మైమరిపించింది. కూచిపూడి నృత్యం చేసి అందరి మన్ననలు అందుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి,అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది డింపుల్. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా హీరోయిన్ డింపుల్ హయాతి గల్ఫ్ (2017) సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దలకొండ గణేశ్, యురేకా, ఖిలాడీ, రామబాణం, దిల్ మార్, అత్రంగిరే (హిందీ), వీరమే వాగై సూదం (తమిళ్), భర్త మహాశయులకు తదితర సినిమాలు డింపుల్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘భోగి’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది డింపుల్. ఇందులో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

శ్రీకాళహస్తీశ్వరాలయంలో హీరోయిన్ డింపుల్ హయాతి.. వీడియో ఇదిగో..

Follow Us
శ్రీకాళహస్తీశ్వరాలయంలో హీరోయిన్ డింపుల్ ప్రత్యేక పూజలు.. వీడియో
శ్రీకాళహస్తీశ్వరాలయంలో హీరోయిన్ డింపుల్ ప్రత్యేక పూజలు.. వీడియో
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు
ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తి నీటి విడుదల
ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తి నీటి విడుదల
రేబిస్‌తో రెండేళ్ల బాలుడి మరణం..
రేబిస్‌తో రెండేళ్ల బాలుడి మరణం..
భర్తను ప్రాణంగా ప్రేమించే 3 నక్షత్రాల మహిళలు.. వీరు భార్యగా వస్తే
భర్తను ప్రాణంగా ప్రేమించే 3 నక్షత్రాల మహిళలు.. వీరు భార్యగా వస్తే
ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి జీతాలు
ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి జీతాలు
భోజనాల్లో వడ్డించే కమ్మని క్యాబేజీ క్యారెట్ కొబ్బరి వేపుడు
భోజనాల్లో వడ్డించే కమ్మని క్యాబేజీ క్యారెట్ కొబ్బరి వేపుడు
హైదరాబాద్‌లో అందుబాటులోకి లేటెస్ట్‌ వర్షన్ సెక్యూరిటీ సిస్టమ్!
హైదరాబాద్‌లో అందుబాటులోకి లేటెస్ట్‌ వర్షన్ సెక్యూరిటీ సిస్టమ్!
ఏపీలో కొత్త పింఛన్లపై ప్రభుత్వం అప్డేట్.. అప్పటినుంచే పంపిణీ..
ఏపీలో కొత్త పింఛన్లపై ప్రభుత్వం అప్డేట్.. అప్పటినుంచే పంపిణీ..
రైతులకు గుడ్‌న్యూస్.. వ్యవసాయ సోలార్ పంప్‌సెట్ల ప్రయోగం సక్సెస్
రైతులకు గుడ్‌న్యూస్.. వ్యవసాయ సోలార్ పంప్‌సెట్ల ప్రయోగం సక్సెస్