AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooking Oil Prices: సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు.. పండక్కి ముందు పెద్ద ఊరట..

పండుగల సీజన్‌కు ముందు సామాన్యుడికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వంట నూనెలపై దిగుమతి సుంకాలను భారీగా తగ్గించింది. సెప్టెంబర్ 24 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీని వల్ల హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో వంట నూనెల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

Cooking Oil Prices: సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు.. పండక్కి ముందు పెద్ద ఊరట..
Cooking Oil
Venkatrao Lella
|

Updated on: Sep 24, 2026 | 9:22 PM

Share

నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడి బ్రతుకు బండి భారంగా నడుస్తున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.  రాబోయే దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరల భారం నుంచి ప్రజలకు ఊరట కల్పించే లక్ష్యంతో వంట నూనెలపై దిగుమతి సుంకాలను భారీగా తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దేశీయ మార్కెట్లో పెరుగుతున్న వంటనూనెల ధరలను అదుపులోకి తీసుకురావడమే ఈ చర్య వెనుక ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సన్‌ఫ్లవర్, సోయాబీన్, పామాయిల్ వంటి ముడి, రిఫైన్డ్ రకాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. ఈ సవరించిన నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రభుత్వం అత్యంత భారీగా సుంకాన్ని తగ్గించింది. క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి పూర్తిగా సున్నాకు తగ్గించారు. అంటే ఇకపై దీనిపై ఎటువంటి ప్రాథమిక పన్ను ఉండదని చెప్పవచ్చు.

రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ నూనెపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 32.5 శాతం నుంచి 22.5 శాతానికి తగ్గించారచు. అంటే 10 శాతం మేర తగ్గించారని చెప్పవచ్చు. అదే విధంగా ఇతర ముఖ్యమైన నూనెలపై కూడా పన్నుల కోత విధించారు. ముడి సోయాబీన్, పామాయిల్‌పై ఉన్న 10 శాతం సుంకాన్ని 5 శాతానికి తగ్గించారు. రిఫైన్డ్ సోయాబీన్, పామాయిల్‌పై ఉన్న 32.5 శాతం పన్నును 27.5 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులు, దేశీయ అవసరాలను బేరీజు వేసుకొని ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల నూనెల దిగుమతి వ్యయం గణనీయంగా తగ్గుతుంది. దిగుమతి సుంకాలు తగ్గటం వల్ల మార్కెట్లో వంట నూనెల లభ్యత పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంది. నిత్యం పెరిగే ధరలతో సతమతమవుతున్న పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఈ నిర్ణయం ఆర్థికంగా కొంత వెసులుబాటును కలిగిస్తుంది. కుటుంబ బడ్జెట్‌లో నూనె ఖర్చు తగ్గడం వల్ల సామాన్యుడికి ఇది నిజంగా శుభవార్తగా చెప్పవచ్చు.

త్వరలో దసరా, దీపావళి లాంటి పండుగులు వస్తున్నాయి. ఈ రెండు అత్యంత ముఖ్యమైన పండగలుగా చెప్పవచ్చు. ఇప్పటికే ఉల్లిపాయలు, షుగర్, నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది. ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వంట నూనె ధరలు దిగి రానున్నాయి. ఇటీవల యుద్ద పరిస్థితులు, ఎల్‌నివో ప్రభావం వల్ల వంటనూనె ధరలు పెరిగాయి. ఇప్పుడు కేంద్ర నిర్ణయంతో కాస్త ఊరట కలిగింది.

Follow Us
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు
ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తి నీటి విడుదల
ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తి నీటి విడుదల
రేబిస్‌తో రెండేళ్ల బాలుడి మరణం..
రేబిస్‌తో రెండేళ్ల బాలుడి మరణం..
భర్తను ప్రాణంగా ప్రేమించే 3 నక్షత్రాల మహిళలు.. వీరు భార్యగా వస్తే
భర్తను ప్రాణంగా ప్రేమించే 3 నక్షత్రాల మహిళలు.. వీరు భార్యగా వస్తే
ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి జీతాలు
ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి జీతాలు
భోజనాల్లో వడ్డించే కమ్మని క్యాబేజీ క్యారెట్ కొబ్బరి వేపుడు
భోజనాల్లో వడ్డించే కమ్మని క్యాబేజీ క్యారెట్ కొబ్బరి వేపుడు
హైదరాబాద్‌లో అందుబాటులోకి లేటెస్ట్‌ వర్షన్ సెక్యూరిటీ సిస్టమ్!
హైదరాబాద్‌లో అందుబాటులోకి లేటెస్ట్‌ వర్షన్ సెక్యూరిటీ సిస్టమ్!
ఏపీలో కొత్త పింఛన్లపై ప్రభుత్వం అప్డేట్.. అప్పటినుంచే పంపిణీ..
ఏపీలో కొత్త పింఛన్లపై ప్రభుత్వం అప్డేట్.. అప్పటినుంచే పంపిణీ..
రైతులకు గుడ్‌న్యూస్.. వ్యవసాయ సోలార్ పంప్‌సెట్ల ప్రయోగం సక్సెస్
రైతులకు గుడ్‌న్యూస్.. వ్యవసాయ సోలార్ పంప్‌సెట్ల ప్రయోగం సక్సెస్
ఏపీలో మరో కొత్త పథకం.. రూ.1400 విలువ చేసే వస్తువులు ఫ్రీ..
ఏపీలో మరో కొత్త పథకం.. రూ.1400 విలువ చేసే వస్తువులు ఫ్రీ..