AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఇప్పుడు మెషిన్స్ షాపులో.. ఎవరో గుర్తు పట్టారా?

ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. అనుకున్నట్లు గానే మంచి ట్యాలెంటెడ్ డైరెక్టర్ తో మొదటి సినిమా తీశాడు. సూపర్ హిట్ అందుకున్నాడు. హీరోగా యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.. కానీ కట్ చేస్తే.. ఇప్పుడు విజయవాడ మెషిన్స్ షాపులో కనిపించాడు..

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఇప్పుడు మెషిన్స్ షాపులో.. ఎవరో గుర్తు పట్టారా?
Ee Rojullo Movie Hero Sree
Basha Shek
|

Updated on: Dec 14, 2025 | 5:47 PM

Share

పై ఫొటోలో గుబురు గడ్డంతో కనిపిస్తోన్నదెవరో గుర్తు పట్టారా? చాలా కష్టంగా ఉంది కదా.. అతను ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో. విజయవాడలో పుట్టి పెరిగాడు. అక్కడే చదువుకున్నాడు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆపై సినిమాల మక్కువతో హైదరాబాద్ కు వచ్చేశాడు. అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగాడు. అదే సమయంలో అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటోన్న ఒక డైరెక్టర్ తో సినిమాకు కమిట్ అయ్యాడు. చిన్న సినిమానే అయినా మొదటి మూవీతోనే మంచి హిట్ కొట్టాడు. హీరోగా యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత కూడా చాలా సినిమాల్లోనూ నటించాడు. కేవలం హీరోగానే కాకుండా సహాయక నటుడిగానూ మెప్పించాడు. కట్ చేస్తే.. ఉన్నట్లుండి సినిమా ఇండస్ట్రీ నుంచి అదృశ్యమయ్యాడు. 2016లో సినిమాలో నటించిన అతను గత తొమ్మిదేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం తన సొంతూరు విజయవాడలో వ్యవసాయ సంబంధిత మెషీన్స్ తయారుచేసే కంపెనీని నడపుతున్నాడు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం హీరో ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. మరి అతనెవరో గుర్తు పట్టారా?

ఇవి కూడా చదవండి

మొదటి సినిమాతోనే సెన్సేషన్..

2012లో ది రాజాసాబ్ డైరెక్టర్ మారుతి తెరకక్కించిన ఈరోజుల్లో సినిమా గుర్తుందా? అందులో నటించిన హీరో గుర్తున్నాడా? పై ఫొటోలో ఉన్నది హీరోనే. పేరు శ్రీ అలియాస్ మంగం శ్రీనివాస్. రోజుల్లో మూవీ తర్వాత రయ్ రయ్, అరవింద్ 2, తమాషా, పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్, గలాటా, సాహసం చేయరా డింభకా, లవ్ సైకిల్ దాదాపు 12 సినిమాలు చేశాడు శ్రీనివాస్. కానీ సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. దీంతో క్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఇప్పుడు సొంతూరు విజయవాడలో వ్యవసాయ సంబంధిత మెషీన్స్ తయారు చేసే ఓ కంపెనీ నడుపుతున్నాడీ టాలీవుడ్ హీరో.

‘2020లో కొవిడ్ కారణంగా నాన్న చనిపోయాడు. దీంతో నేను బిజినెస్ లోకి వచ్చాను. ఇది మా ఫ్యామిలీ బిజినెస్. మా తాత నుంచి తండ్రికి, ఆయన నుంచి నాకు వచ్చింది. దీనితో పాటు హైదరాబాద్‌లో వారాహి స్టూడియోస్ అని ఓ డబ్బింగ్ స్టూడియో కూడా ఉంది. సరైన ప్లానింగ్, గైడెన్స్ లేకపోవడం వల్లనే నేను సినిమాల్లో సక్సెస్ అవ్వలేకపోయాను.నా భార్య కూడా సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సాహిస్తుంది. కానీ నాకే సరైన అవకాశాలు రాక ఇలా ఉండిపోయానుఅని చెప్పుకొచ్చారు శ్రీనివాస్. ప్రస్తుతం హీరో ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. అప్పట్లో పోలిస్తే ఇప్పుడు అసలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాడీ టాలీవుడ్ క్రేజీ హీరో.

Ee Rojullo Movie Fame Sree

Ee Rojullo Movie Actor Sree

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి