OTT Movie: ‘ఉప్పెన’ను మించి షాకింగ్ క్లైమాక్స్.. ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది రాజు వెడ్స్ రాంబాయి. థియేటర్లలో ఈ మూవీని చూసి చాలామంది ఆడియెన్స్ కన్నీళ్లతో బయటకు వచ్చారు. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను ఎగబడి చూశారు. ఇప్పుడీ హార్ట్ టచింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ ప్రేమ కథా చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో, హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరికీ ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. అయినా తమ అద్బుత నటనతో ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టించారు. ఇక సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ విలన్ పాత్రలో బాగా భయపెట్టాడు. ఈ సినిమాలో అతని నటనే హైలెట్ అని చెప్పుకోవచ్చు. నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టింది చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రూరల్ లవ్ స్టోరీ రూ.17 కోట్ల కు పైగా కలెక్షన్లు రాబట్టింది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే వీరి నిరీక్షణకు తెరపడనుంది. రాజు వెడ్స్ రాంబాయి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 19 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో రాజు వెడ్స్ రాంబాయి ఓటీటీ స్ట్రీమింగ్ పోస్టులు దర్శనమిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడవచ్చు.
డా. నాగేశ్వర్ పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్‌లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేశారు. శివాజీ రాజా, అనిత చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సురేష్ బొబ్బలి సంగీతం అందించారు.
డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కు ఛాన్స్..
#TMSRUpdates #TMSRUOTTUpdates #RajuWedsRambai Premieres December 19th On #EtvWin Also Available In Dolby Vision and Atmos@etvwin @venuudugulafilm @rahulmopidev @Monsoontal2444 @TheBunnyVas @connect2vamsi #Tejaswi #ChaitanyaJonnalagadda @AnithaChowdhary @nareshadupa pic.twitter.com/t7UUhg0Ifi
— TMSRUpdates ❁ (@TMSRUpdates) December 12, 2025
Heartfelt words. Pure emotions. The greatest love story of Raju & Rambai unfolds beautifully on the big screen. Experience it with #RajuWedsRambai! pic.twitter.com/dHbcVn0Gwh
— Bunny Vas (@TheBunnyVas) November 28, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








