OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ బ్లాక్ బస్టర్ .. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDB టాప్ రేటింగ్ మూవీ
ఈ మూవీ థియేటర్లలో అదరగొట్టింది. కొన్ని రోజుల క్రితం ఒరిజినల్ వెర్షన్ స్ట్రీమింగ్‌లోకి రాగా మూవీ లవర్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఇప్పుడు తెలుగు తో పాటు తమిళ వెర్షన్స్‌ని కూడా తీసుకొచ్చేశారు. ఈ మూవీకి ఐఎమ్ డీబీలో 7.5 రేటింగ్ ఉండడం విశేషం.

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (డిసెంబర్ 12) పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్, మలయాళం, తమిళ్.. ఇలా వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. అయితే ఈ లిస్టులో ఒక కన్నడ డబ్బింగ్ మూవీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో విడుదలైంది. సినీ ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందించింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇటీవలే ఈ మూవీ ఒరిజినల్ వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక్కడ కూడా ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఓటీటీ నిర్వాహకులు ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోకి అనువాదం చేసి స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. క్రిస్టీ అనే యువకుడు ఫ్రెండ్స్‌ను వెంటపెట్టుకుని జులాయిగా తిరుతుంటాడు. ఈజీ మనీ కోసం కలలు కంటూ క్రికెట్ బెట్టింగ్స్‌కు పాల్పడుతూ ఉంటాడు. అయితే, క్రిస్టీ తండ్రి మాత్రం ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. మరి కొడుకు బెట్టింగులకు పాల్పడుతున్నాడని తెలుసుకున్న తండ్రి ఏం చేశాడు? క్రిస్టీ బెట్టింగ్స్ వల్ల అతనితో పాటు అతని ఫ్యామిలీ ఎలాంటి చిక్కుల్లో పడింది. తండ్రి-కొడుకుల ఫైటింగ్ ఎంత వరకు వెళ్లింది? చివరకు ఏమైందన్నది తెలుసుకోవాలంటే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే.
ఈ సినిమా పేరు బ్రాట్. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో డార్లింగ్ కృష్ణ హీరోగా నటించాడు. మనీషా కంద్కూర్ ప్రధాన పాత్రల్లో నటించగా… అచ్యుత్ కుమార్, రమేష్ ఇందిర, డ్రాగన్ మంజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. శశాంక్ తెరకెక్కించిన ఈ సినిమాను డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మంజునాథ్ వి.కంద్కూర్ నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది.
అమెజాన్ ప్రైమ్ లో బ్రాట్ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్..
Just watched #BRAT — easily the best film I’ve seen this year! 🔥@Shashank_dir sir delivers another solid hit. Brilliant performances,amazing technical work, and a gripping narrative.
And @ArjunJanyaMusic background score elevates every moment! 🔥👌#DarlingKrishna #Shashank pic.twitter.com/8IT66UMDgS
— 𝙏𝙝𝙞𝙨 𝙠𝙖𝙧𝙩𝙝𝙞’𝙨 𝙓 ⁴⁵ (@AMkarthik63) December 3, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








