Cinema: భార్య తీరని లగ్జరీ కోరికలు.. భర్త శవంతో ఇంట్లోనే.. ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ..
ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చిన కొన్ని వారాలకే ఓటీటీలోకి వస్తుంటాయి. బాక్సాఫీస్ వద్ద హిట్టైనా, ఫట్టైనా.. కేవలం నెల రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తుంటాయి. ఇప్పుడు అడియన్స్ ముందుకు ఓ డార్క్ కామెడీ మూవీ వచ్చేసింది. ఇన్నాళ్లు హిందీలోనే ఉన్న సినిమా ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసుకుందామా.

భారతీయ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు రాధిక ఆప్టే. తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యింది. ఇటీవల ఆమె నటించిన లేటేస్ట్ మూవీ సిస్టర్ మిడ్ నైట్. బోల్డ్ కాన్సెప్ట్ తో డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి కరణ్ కాందహారి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాధికతోపాటు అశోక్ పాఠక్, ఛాయా కదమ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. మే 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఇక ఇది ఒక సినిమా ఉందనే విషయం కూడా జనాలకు అంతగా తెలియదు. సైలెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో తెలుగులో అందుబాటులోకి వచ్చేసింది.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..
థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అయ్యింది. కానీ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చేసింది. డిసెంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. హిందీలో అందుబాటలో ఉన్న ఈ సినిమాకు తెలుగుతోపాటు తమిళం డబ్బింగ్ యాడ్ చేశారు.
ఇవి కూడా చదవండి : Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..
కథ విషయానికి వస్తే.. గోపాల్ (అశోక్ పాఠక్), ఉమ (రాధిక ఆప్టే) పక్క పక్క గ్రామాల్లోనే ఉంటారు. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. దీంతో తన పెళ్లి ఉమకు అస్సలు నచ్చదు. భార్యతోపాటు ముంబైలో ఓ మురికి వాడలో చిన్న ఇంట్లో నివసిస్తుంటాడు గోపాల్. కానీ ఉమకు అక్కడ ఉండడం, వంట పనులు చేయడం నచ్చదు. కానీ లగ్జరీగా ఉండాలనే కోరికలు ఎక్కువే. దీంతో మానసిక ఒత్తిడి పెరగడంతో వింతగా ప్రవర్తిస్తుంటుంది. జంతువులను చంపేస్తుంటుంది. ఒకరోజు తెల్లారి లేచేసరికి భర్త శవమై కనిపిస్తాడు. భర్త శవాన్ని ఇంట్లోనే పెట్టి ఉమ ఏం చేసింది.. ? ఆ తర్వాత ఏం జరిగింది ? అనేది సినిమా.
ఇవి కూడా చదవండి : Tollywood : అవకాశం ఇస్తానని ఇంటికొచ్చి మరీ అలా ప్రవర్తించాడు.. గుప్పెడంత మనసు సీరియల్ నటి..
ఇవి కూడా చదవండి : Actress Vahini : అప్పుడు సీరియల్స్‌తో క్రేజ్.. క్యాన్సర్‌తో పోరాటం.. సాయం కోరుతూ పోస్ట్..








