AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda 2 : హైకోర్టులో అఖండ 2 సినిమాకు షాక్..

నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా అఖండ 2. డిసెంబర్ 2న విడుదల కావాల్సిన ఈ మూవీ పలు అనివార్య కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అన్ని సమస్యలు తొలగిపోయి ఇప్పుడు డిసెంబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ సినిమాకు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది.

Akhanda 2 : హైకోర్టులో అఖండ 2 సినిమాకు షాక్..
Balakrishna Akhanda 2 Movie
Rajitha Chanti
|

Updated on: Dec 11, 2025 | 3:31 PM

Share

అఖండ-2 కు నిర్మాతలకు భారీ షాక్‌ తగిలింది. ఈ సినిమా ప్రీయయర్‌ షో టికెట్ ధరల పెంపు జీవోను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాల మధ్య విడుదల కానున్న సినిమా అఖండ 2. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి కాంబోలో రాబోతున్న ఈసినిమాను డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 11 నుంచి ఈ సినిమా ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ క్రమంలో అఖండ 2 తాండవం సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది.

ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..

టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు టికెట్ ధరల పెంపుతోపాటు ప్రత్యేక షోల నిర్వహాణపై కూడా విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ‘అఖండ 2’ మూవీ టికెట్ హైక్స్ ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని రద్దు చేయాలని కోరుతూ శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..

అఖండ 2 సినిమా టికెట్ ధరలను డిసెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనుమితి ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై రూ.50, మల్టీప్లెక్స్ లో రూ.100 అదనంగా వసూలు చేసుకోవచ్చు. డిసెంబర్ 11న ప్రదర్శించే ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఈ అనుమతితోపాటు చిత్రటీంకు ప్రభుత్వం ఒక షరతు సైతం విధించింది. టికెట్స్ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు లాభాల్లో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి తప్పనిసరిగా కేటాయించాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

Follow Us
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే