AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Vahini : అప్పుడు సీరియల్స్‏తో క్రేజ్.. క్యాన్సర్‏తో పోరాటం.. సాయం కోరుతూ పోస్ట్..

ఒకప్పుడు బుల్లితెరపై సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన నటీనటులు ఇప్పుడు స్క్రీన్ పై కనిపించడం లేదు. అప్పట్లో విభిన్న పాత్రలలో సహజ నటన, సౌందర్యంతో కట్టిపడేసిన తారలు.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. టాలీవుడ్ సహాయ నటి వాహిని క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నారు.

Actress Vahini : అప్పుడు సీరియల్స్‏తో క్రేజ్.. క్యాన్సర్‏తో పోరాటం.. సాయం కోరుతూ పోస్ట్..
Vahini
Rajitha Chanti
|

Updated on: Dec 12, 2025 | 3:06 PM

Share

ప్రస్తుతం సీరియల్ నటి వాహిని క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నారు. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి తెలియజేస్తూ.. తన చికిత్సకు ఆర్థిక సహాయం కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నటి వాహిని తెలుగు సినీ, సీరియల్ ప్రియులకు సుపరిచితమే. ఒకప్పుడు తెలుగులో అనేక సినిమాలు, సీరియల్లలో సహాయ పాత్రలు పోషించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన సహజ నటనతో అందరిని ఆకట్టుకుంది. 1978లో జన్మించిన వాహిని.. ఎక్కువగా జయవాహిని పేరుతో ప్రసిద్ధి చెందారు. సౌందర్య నటించిన శ్వేత నాగు చిత్రంలో వాసుకి పాత్రలో కనిపించింది. అలాగే పలు సీరియల్స్ ద్వారా బుల్లితెరపై ఫేమస్ అయ్యింది. చాలా కాలం ఇండస్ట్రీలో యాక్టివ్ గా కనిపించిన వాహిని.. గతేడాది బహిర్భూమి అనే సినిమాలోనూ నటించింది. అయితే కొన్నాళ్లుగా సినిమాలకు, సీరియల్స్ కు దూరంగా ఉంటుంది.

తాజాగా వాహిని ఆరోగ్య పరిస్థితి గురించి నటి కరాటే కల్యాణి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆమె గత కొన్ని నెలలుగా రొమ్ము క్యా్న్సర్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారి పలు అవయవాల పనితీరులో లోపాలు కనిపించడంతో ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు నిరంతర చికిత్స, కీమోథెరపీ, ఆపరేషన్, ఐసీయూ కేర్ కోసం ₹25 లక్షల నుంచి ₹35 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. దీంతో ఆర్థిక సాయం కావాలంటూ కరాటే కల్యాణి పోస్ట్ చేశారు.

అందరికీ నమస్తే ఆర్టిస్ట్ జీవితం ఎప్పుడు ఎలా మలుపుతిరుగుతుందో తెలియదు మద్రాస్ నడిగర సంఘంమెంబర్షిప్ ఉండి తెలుగు సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ వేసి ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో అప్పుడప్పుడు సీరియల్స్ లో మెరుస్తున్న పద్మక్క అలియాస్ వాహిని మా విజయనగరం విజయనగరంలో మా పెదనాన్న ఇంటి పక్కనే ఉండేవారు చిన్నప్పుడు ఆవిడ సినిమాల్లోకి వెళ్ళినప్పుడు నేను స్కూల్లో ఉన్నాం కానీ ఈరోజు ఆ అక్కకి ఇలా క్యాన్సర్ మహమ్మారసోకి ప్రాణాంతకంగా మారింది మనందరం సహృదయంతో ఎంత తోచితే అంత సహాయం చేద్దాం ఒక ప్రాణాన్ని కాపాడుకుందాం తెరపై నటించి మనల్ని అందరినీ అలరించిన ఈ నటిమని కష్టంలో ఉన్నప్పుడు మనందరం ఆదుకోవాల్సిన సమయం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం మీరు కూడా ఒక చేయూతనిస్తారని కోరుతూ నా స్నేహితులను అభిమానులను అభ్యర్థిస్తున్నాను చేతనేని సహాయం చేయండి అత్యవసర వైద్య సహాయం కోసం హృదయపూర్వక విజ్ఞప్తి జయవాహిని గారికి సహాయం చేయండి. గత కొన్ని నెలలుగా, ఆమె అడ్వాన్స్‌డ్-స్టేజ్ (ముదిరిన దశ) రొమ్ము క్యాన్సర్‌తో వీరోచితంగా పోరాడుతున్నారు. దురదృష్టవశాత్తూ, ఆమె ఆరోగ్యం విషమించి, బహుళ-అవయవాలు (multi-organ failure) దెబ్బతినడం వలన ఆమెకు తక్షణమే మరియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో చికిత్స అత్యవసరమైంది.అంటూ రాసుకొచ్చారు.

Vahini Health

Vahini Health

ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

క్యాన్సర్‏తో పోరాడుతున్న సీరియల్‏ నటి.. ఆర్థిక సాయం కోరుతూ పోస్ట్
క్యాన్సర్‏తో పోరాడుతున్న సీరియల్‏ నటి.. ఆర్థిక సాయం కోరుతూ పోస్ట్
చలికి చేతి వేళ్లు నీలం రంగులోకి మారుతున్నాయా..?
చలికి చేతి వేళ్లు నీలం రంగులోకి మారుతున్నాయా..?
కేవలం రూ.5 వేలకే పెద్ద స్క్రీన్.. ఇంట్లోనే సినిమా థియేటర్ రేంజ్
కేవలం రూ.5 వేలకే పెద్ద స్క్రీన్.. ఇంట్లోనే సినిమా థియేటర్ రేంజ్
రాజకీయాల నుంచి మళ్లీ మ్యాట్ పైకి వినేశ్ రీ ఎంట్రీ..టార్గెట్ అదే
రాజకీయాల నుంచి మళ్లీ మ్యాట్ పైకి వినేశ్ రీ ఎంట్రీ..టార్గెట్ అదే
2025లో ఊహించని విధంగా డిజాస్టర్ అయిన భారీ బడ్జెట్ మూవీస్ ఇవే!
2025లో ఊహించని విధంగా డిజాస్టర్ అయిన భారీ బడ్జెట్ మూవీస్ ఇవే!
2026 రాబోతుంది.. ఈ సవత్సరం జనవరిలో పెళ్లి ముహుర్తాలు లేవా? మళ్లీ
2026 రాబోతుంది.. ఈ సవత్సరం జనవరిలో పెళ్లి ముహుర్తాలు లేవా? మళ్లీ
మీరు ఇది నమ్మలేరు.. రోజూ ఓం జపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
మీరు ఇది నమ్మలేరు.. రోజూ ఓం జపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
శాలరీ అకౌంట్ ఉన్నవారు లక్కీ.. ఈ బెనిఫిట్స్ తెలిస్తే..
శాలరీ అకౌంట్ ఉన్నవారు లక్కీ.. ఈ బెనిఫిట్స్ తెలిస్తే..
ఉదయం పూట బ్రేక్‌ ఫాస్ట్‌ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
ఉదయం పూట బ్రేక్‌ ఫాస్ట్‌ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
రెండో టీ20 లో ఘోర ఓటమితో టీమిండియా చెత్త రికార్డు
రెండో టీ20 లో ఘోర ఓటమితో టీమిండియా చెత్త రికార్డు