Tollywood : అవకాశం ఇస్తానని ఇంటికొచ్చి మరీ అలా ప్రవర్తించాడు.. గుప్పెడంత మనసు సీరియల్ నటి..
మిర్చి మాధవి.. తెలుగు సినీప్రియులకు తెలిసిన పేరు. ప్రస్తుతం అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. చాలాకాలంగా సినిమాల్లో ఉన్నప్పటికీ మిర్చి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బుల్లితెరపై మరింత ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఇల్లు ఇల్లాలు ప్రియురాలు సీరియల్లో భాగ్యం పాత్రలో అలరిస్తున్నారు.

నటి మిర్చి మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీరియల్స్, సినిమాల ద్వారా మెప్పించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానంలోని విషయాలు, పరిశ్రమలో ఎదురైన సవాళ్లను పంచుకున్నారు. కాస్టింగ్ కౌచ్ అనుభవం, సెట్స్‌లో క్రమశిక్షణ లోపంపై అనేక విషయాలను ఇంటర్వ్యూలో వెల్లడించారు. 13 సంవత్సరాల క్రితం తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఆమె వివరించారు. ఒక సినిమాలో నటించడానికి ఐదుగురికి “కమిట్‌మెంట్” ఇవ్వమని కోరినట్లు తెలిపారు. అయితే ఆ తర్వాత అలాంటి అనుభవాలు మళ్లీ రాలేదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని, తన ప్రయాణంపై దృష్టి సారించాలని నమ్ముతున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..
సినిమా పరిశ్రమలో తనకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయని అంగీకరించినా, వాటి కోసం ప్రయత్నిస్తూనే ఉంటానని తెలిపారు. బాలకృష్ణ నటించిన మహా నాయకుడు సినిమా షూటింగ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. భవిష్యత్తులో నటనతో పాటు తాను రాసిన స్క్రిప్ట్‌లను తెరకెక్కించాలని, ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని ఉందన్నారు. 13 సంవత్సరాల క్రితం తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని మిర్చి మాధవి వెల్లడించారు. ఒక సినిమాలో నటించే అవకాశం కోసం ఐదుగురికి “కమిట్‌మెంట్” ఇవ్వమని కోరినట్లు తెలిపారు. అయితే ఇది తన కెరీర్‌లో ఒకే ఒక్కసారి ఎదురైన సంఘటన అని, మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ రకమైన సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు భయపడకుండా, తన జర్నీపై దృష్టి సారించి ముందుకు వెళ్లడమే ముఖ్యమని ఆమె సూచించారు.
ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..
అలాగే 12 ఏళ్ల క్రితం ఒక దర్శకుడు ఫోన్ చేసి తాను ఇంకా ఆఫీస్ పెట్టలేదని.. ఇంటికొచ్చి మాట్లాడతానని అన్నాడని.. ఇంటికి వచ్చాకా.. చీరకట్టుకుని నడిచి చూపించాలని అన్నాడు. ఆ తర్వాత నడుము చూపించు అన్నాడని.. వెంటనే కోపంతో నువ్వు లేరా .. చెప్పు తీసుకుని కొడతా.. బయటకు పో అని గెంటేశాను. ఆయన ఏమైనా చేసుంటే నా పరిస్థితి ఏంటీ ? అని వణికిపోయానని గుర్తుచేసుకుని చేసుకున్నారు. మిర్చి మాధవి పోస్ట్-గ్రాడ్యుయేట్ పట్టా పొంది, సాఫ్ట్ స్కిల్స్, కార్పొరేట్ ట్రైనర్‌గా సర్టిఫికేషన్ కూడా పూర్తి చేశారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రేరణాత్మక షార్ట్‌లను పోస్ట్ చేస్తారని, వాటి ద్వారా ఇతరులకు స్ఫూర్తినిస్తారని తెలిపారు. పరిశ్రమలో మానసికంగా ఇబ్బంది పడుతున్న ఒక సహోద్యోగికి ఆమె ఇచ్చిన సలహాను పంచుకున్నారు, “ఇది శాశ్వతం కాదు, అవకాశాలు రాకపోయినా నిరాశ చెందవద్దు” అని ఆమె ధైర్యం చెప్పారు.

Madhavi
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..








