AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : ఇక బిగ్‏బాస్ చూడడం దండగ.. విన్నర్ ఎవరో ముందే ఫిక్స్.. అస్సలు ఊహించలేదే..

బిగ్ బాస్ సీజన్ 9.. ఈసారి విన్నర్ ఎవరో ముందే ఫిక్స్ చేశారు. కానీ ఎందుకు ఈ గేమ్ అంతా అంటూ నెట్టింట మండిపడుతున్నారు అడియన్స్. మొత్తం స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుందని... హోస్ట్.. బిగ్ బాస్ పూర్తిగా ఒకరికే సపోర్ట్ చేస్తున్నారంటూ ముందు నుంచి వినిపిస్తున్న మాట. ఇప్పుడు మరోసారి ఈ చర్చ నెట్టింట ఊపందుకుంది. విన్నర్ ఎవరనేది ముందే ఫిక్స్ చేశారంటూ ప్రచారం నడుస్తుంది.

Bigg Boss 9 Telugu : ఇక బిగ్‏బాస్ చూడడం దండగ.. విన్నర్ ఎవరో ముందే ఫిక్స్.. అస్సలు ఊహించలేదే..
Bigg Boss 9 Telugu Winner
Rajitha Chanti
|

Updated on: Dec 10, 2025 | 5:19 PM

Share

బిగ్ బాస్ సీజన్ 9.. గ్రాండ్ ఫినాలేకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఇప్పుడు హౌస్ లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. డీమాన్ పవన్, సంజన, ఇమ్మాన్యుయేల్, కళ్యా్ణ్ పడాల, భరణి శంకర్, సుమన్ శెట్టి, సంజన హౌస్ లో ఉన్నారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందనే టాక్ వినిపిస్తుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ తోపాటు .. వీకెండ్ ఎలిమినేషన్ జరగనుందని సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం మిడ్ వీక్ సుమన్ శెట్టి.. వీకెండ్ సంజన బయటకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల టాప్ 5 కంటెస్టెంట్స్ ఫిక్స్ అని తెలుస్తోంది. ఇక వీరిలో టైటిల్ రేసులో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు కళ్యాణ్ పడాల, తనూజ.

ప్రస్తుతం బిగ్ బాస్ టైటిల్ కు దగ్గరగా కళ్యాణ్ పడాల, తనూజ అత్యధిక ఓటింగ్ తో దూసుకుపోతున్నారు. కామన్ మెన్ కోటా నుంచి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్.. మొదట్లో నెగిటివిటీని ఎదుర్కొన్నాడు. కానీ నెమ్మదిగా తన ఆట తీరును మార్చుకుంటూ విన్నర్ ఇతడే అనేలా చేశాడు. కానీ కళ్యాణ్ ఆట ఇప్పుడు దారి తప్పినట్లుగా తెలుస్తోంది. కేవలం తనూజ కోసమే గేమ్ ఆడుతున్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఇదే విషయాన్ని అటు భరణి సైతం బ్లాస్ట్ అయ్యాడు. అయితే ముందు సీజన్ 9 విన్నర్ తనూజ అని టాక్ చక్కర్లు కొడుతుంది.

జనాల ఓటింగ్ ప్రకారం కళ్యాణ్ టాప్ ప్లేస్ లో ఉండగా… తనూజ రెండో స్థానంలో ఉంది. కానీ ప్రేక్షకుల లెక్కలు కాకుండా బిగ్ బాస్ ఓటింగ్ అంటే మాత్రం తూజ విన్నర్ కావడం ఖాయమని అంటున్నారు. ఈ సీజన్ మొదటి నుంచి తనూజకు ఎక్కువగా సపోర్ట్ ఉందని.. ఆమె తప్పు చేసినా తనకే మద్దతు తెలుపుతున్నారని నెటిజన్స్ వాపోతున్నారు. నిజానికి తనూజ ఫిజికల్ టాస్కులలో అంతగా పోటీపడింది లేదు. ఆమె కంటే డీమాన్ పవన్, కళ్యాణ్, భరణి, రీతూ చౌదరి ఫిజికల్ టాస్కులలో అదరగొట్టేశారు. కానీ విన్నర్ మాత్రం తనూజ అంటూ నెట్టింట జోరుగా నడుస్తుంది. మరోవైపు ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది ముందే ఫిక్స్ అయ్యారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అందరూ ఊహించినట్లుగా తనూజ, కళ్యాణ్ కాకుండా ఈసారి ఇమ్మాన్యుయేల్ విన్నర్ కాబోతున్నాడని తెలుస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు అతడినే ఫైనల్ చేశారని అంటున్నారు. దీంతో నెట్టింట అడియన్స్ రియాక్ట్ అవుతున్నారు. విన్నర్ ఎవరో ముందే ఫిక్స్ అయితే.. మరీ షో చూడడం ఎందుకని కామెంట్స్ చేస్తున్నారు.  మరీ ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..

Follow Us
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!