Sairat : వాటే ఛేంజ్ అమ్మడు.. బాక్సాఫీస్ సెన్సేషన్.. సైరత్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..
కంటెంట్ బాగుంటే భాషతో సంబంధమే లేదు. ఈ మాటను ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వివిధ భాషలలో వచ్చిన చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం ఓ మరాఠీ సినిమా పాన్ ఇండియా లెవల్లో సంచలనం సృష్టించింది. ఇంతకీ ఈ మూవీ ఏంటో మీకు గుర్తుందా.. ?

2016లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఒక చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఆ మూవీ దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా పేరు సైరత్. మరాఠీలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో క్రియేట్ చేసిన హిస్టరీ గురించి చెప్పక్కర్లేదు. భాషతో సంబంధమే లేకుండా దేశవ్యాప్తంగా యూత్ ను తెగ ఆకట్టుకుంది. ప్రేమకథగా వచ్చిన ఈ చిత్రానికి కుర్రాళ్లు బ్రహ్మారథం పట్టారు. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ రింకు రాజ్ గురు. ఈ చిత్రంలో అర్చీ అనే అమ్మాయిగా కనిపించి సహజమైన లుక్ లో అందరినీ ఆకట్టుకుంది.
అర్చీ.. మరాఠీలో ఎంతో మంది హృదయాలు దోచుకున్న అమ్మాయి. సైరత్ సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిన ఈ అమ్మడు.. ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉంది. సైరత్ తర్వాత కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే గ్లామర్ షోకు దూరంగా ఉండే రింకు రాజ్ గురు.. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే ఫస్ట్ సినిమా సమయంలో కాస్త బొద్దుగా కనిపించిన రింకు.. ఇప్పుడు మాత్రం తన ఫిట్నెస్ పై మరింత దృష్టి పెట్టింది. ఇప్పుడు ఆమె చాలా ఫిట్ గా మారింది.
వ్యాయమం, డైట్, ఫుడ్ ఇలా ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. రింకు రాజ్ గురు.. 2001 జూలై 3న షోలాపూర్ సమీపంలోని అక్లుజ్ గ్రామంలో జన్మించింది. మరాఠీతోపాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రింకు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..








