AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక మంచి మనిషి పాత్ర చేస్తున్నందుకు సంతోషంగా ఉంది : శివరాజ్ కుమార్

తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకు పెరిగిపోతుంది.. ఎన్నో అద్భుతమైన సినిమాలు తెలుగులో తెరకెక్కుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి మరో అద్భుతమైన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఎన్నో రకాల బయోపిక్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఒక మంచి మనిషి పాత్ర చేస్తున్నందుకు సంతోషంగా ఉంది : శివరాజ్ కుమార్
Shivaraj Kumar
Rajeev Rayala
|

Updated on: Dec 08, 2025 | 9:26 AM

Share

పేదల పక్షపాతి, సైకిల్ పై అసెంబ్లీకి వెళ్లిన ఇల్లందు సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథను తెరపైకి తీసుకొస్తున్నారు దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే. ‘గుమ్మడి నర్సయ్య’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో కన్నడ హీరో శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబర్ 6) పాల్వంచలో గుమ్మడి నర్సయ్య బయోపిక్ షూటింగ్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిత్రయూనిట్ తో పాటు సినిమాటోగ్రఫి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కవిత సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మొదటి సన్నివేశానికి గీతా శివరాజ్ కుమార్ క్లాప్ కొట్టగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని మల్లు స్క్రిప్ట్ అందించారు.

హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ”ఒక మంచి మనిషి రోల్ లో నటిస్తున్నందుకు ఈ రోజు నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పరమేశ్వర్ గారికి, ఎన్. సురేష్ రెడ్డి గారికి థాంక్స్. మా నాన్న గారు కూడా గుమ్మడి నర్సయ్య లాగే ప్రజాసేవ చేసిన మనిషి. మన కోసం కాదు.. ఇతరుల కోసం బతకాలని’ మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు. రీసెంట్ గా గుమ్మడి నర్సయ్య గారి ఇంటికి వెళ్తే మళ్ళీ మా నాన్న గారి దగ్గరకు వచ్చినట్లు అనిపించింది. ఈ సినిమాలో గుమ్మడి నర్సయ్యగా నటించడం నిజంగా నా అదృష్టం. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటా.. నేనే స్వయంగా డబ్బింగ్ చెబుతా. మీ అందరి ఆశీర్వాదం మాపై ఉంటుందని ఆశిస్తున్నా. ఈ సినిమా అందరు రాజకీయ నాయకులకు ఇన్స్పిరేషనల్ సినిమా అవుతుంది” అన్నారు.

గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. ”ఈ వ్యవస్థలో మార్పు రావాలి, మనందరిలో మార్పు రావాలి.. ఒకరిని ఒకరు మోసం చేసుకునే పద్ధతులు మారాలి.. ఇదే నేను కోరుకునేది. నేనేం గొప్ప నాయకుడిని కాదు, అందరిలా సామాన్యుడిని మాత్రమే. నన్ను గొప్పగా కాకుండా నా భావాలను మాత్రమే ఈ సినిమాలో చూపించాలని, చూపిస్తారని ఆశిస్తున్నా. నా బాల్యం నుంచి మొదలు ఇప్పటిదాకా నా గురించి తెలుసుకొని పరమేశ్వర్ గారు ఈ సినిమా రూపొందించారు. శివరాజ్ కుమార్ గారు నా రోల్ చేయడం సంతోషకరం. ఈ సినిమా రిలీజ్ తర్వాత వ్యవస్థలో, ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటున్నా” అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.