AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీ హిట్ పోకిరి సినిమాను మిస్ చేసుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు నటనకు బ్రేక్ ఇచ్చింది

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ పుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.

ఇండస్ట్రీ హిట్ పోకిరి సినిమాను మిస్ చేసుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు నటనకు బ్రేక్ ఇచ్చింది
Pokiri
Rajeev Rayala
|

Updated on: Dec 07, 2025 | 2:49 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. యువరాజు, రాజకుమారుడు, ఒక్కడు, మురారి, పోకిరి వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మహేష్.. ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. వారణాసి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. ఇదిలా ఉంటే.. మహేష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ పోకిరి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన ఈ సినిమా మహేష్ కెరీర్ ను మలుపు తిప్పింది. నిజం, నాని, అర్జున్ వంటి సినిమాలతో వరుసగా డిజాస్టర్స్ అందుకుంటూ సతమతమవుతున్న మహేష్ ను.. భారీ విజయాన్ని అందించిన సినిమా ఇదే.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది.. సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా.. 

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్, లుక్స్, డైలాగ్స్ గురించి చెప్పక్కర్లేదు. అప్పట్లో మహేష్ మ్యానరిజం యూత్ ను ఓ ఊపు ఊపేసింది. మహేష్ బాబుకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఈ సినిమాలో ఇలియానా కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి జోడి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఇక మణిశర్మ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అయ్యింది. కానీ పోకిరి సినిమాను మిస్ అయిన హీరోయిన్ ఎవరో మీకు తెలుసా.. ? నిజానికి ఈ సినిమాకు ఇలియానా ఫస్ట్ ఛాయిస్ కాదు. అప్పట్లో ఈ మూవీ కోసం బాలీవుడ్ హీరోయిన్ కావాలని అనుకున్నారట. అందుకే ముందుగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ను పోకిరి మూవీ కోసం ఎంపిక చేశారు

ఇది కూడా చదవండి : నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్.. అదేంటంటే

అయితే ఈ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు కంగనా హిందీలో గ్యాంగ్ స్టార్ అనే సినిమా చేస్తుంది. దీంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో పోకిరి సినిమాను తిరస్కరించింది. ఆమె స్థానంలోకి ఇలియానాను తీసుకున్నారట. అయితే పోకిరి సినిమాను మిస్ అయినందుకు కంగనా ఎంతో బాధపడినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పోకిరి సినిమాను మిస్ అయిన కంగనా.. ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. రాజకీయాల్లో బిజీగా ఉంటుంది.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?