Actress: ఒక్క మూవీతో సెన్సేషన్.. దెబ్బకు రాత్రికి రాత్రే 9 సినిమాల నుంచి తీసేసారు.. ఎందుకంటే..
సాధారణంగా సినీతారల జీవితాలు ఎప్పుడు ఏ మలుపులు తిరుగుతాయో ఊహించడం కష్టమే. నిజానికి ఒక్క సినిమా హిట్టైతే వారి క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. దీంతో ఆ తారలకు వరుస అవకాశాలు క్యూ కడుతుంటాయి. కానీ ఓ హీరోయిన్ కెరీర్ మాత్రం అనుహ్యంగా టర్న్ అయ్యింది. అవకాశాలు వస్తాయనుకుంటే ఏకంగా 9 సినిమాల నుచి తొలగించారట. ఇంతకీ ఏం జరిగిందంటే..

సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలని అనేక ఆశలతో అడుగుపెడుతుంటారు. ఒక చిన్న అవకాశం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు స్టార్లుగా మారినవారు చాలా మంది ఉన్నారు. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ఊహించని విధంగా ఆమెను సినిమాల నుంచి తొలగించారట. కెరీర్ ప్రారంభంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొని, అనేక కష్టాలు అనుభవించింది. ఇప్పుడు ఆమె తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్. హిందీలో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ మంచి ప్రశంసలు అందుకుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..
అద్భుతమైన నటనతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. అలాగే ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ ఇమేజ్ సైతం సొంతం చేసుకుంది. కానీ కెరీర్ తొలినాళ్లల్లో ఆమెను ఐరన్ లెగ్ అని పిలిచారట. అంతేకాదు.. రాత్రికి రాత్రే 9 సినిమాల నుంచి తొలగించారట. ఈ విషయాన్ని విద్యాబాలన్ స్వయంగా యూట్యూబ్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మొదటగా తనకు చక్ర సినిమాలో మోహల్ లాల్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చిందట. షూటింగ్ ప్రారంభమైన కొన్ని సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఆ సినిమా ఆగిపోయిందట. అందుకు కారణం విద్యాబాలన్ అని ప్రచారం జరిగిందట. దీంతో ఆమెపై ఐరన్ లెగ్ అని ముద్ర వేశారట.
ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..
అప్పట్లో తనపై ఎన్నో విమర్శలు వచ్చాయని.. దీంతో తనను రాత్రికి రాత్రే 9 సినిమాల నుంచి తొలగించారని తెలిపింది. కానీ ఆ సినిమా ఆగిపోవడానికి ప్రత్యేక్షంగా లేదా పరోక్షంగా కానీ తాను కారణం కాదని.. దర్శకుడికి, హీరోకు మధ్య వచ్చిన విభేదాలని అన్నారు. కానీ తానే రీజన్ అంటూ ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారని తెలిపింది. అప్పట్లో ఆ ట్యాగ్ తన కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించిందని తెలిపింది. ది డర్టీ పిక్చర్ సినిమాతో విద్యా బాలన్ భారీ విజయన్ని అందుకుంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

Vidya Balan. News
ఇవి కూడా చదవండి : Sairat : వాటే ఛేంజ్ అమ్మడు.. బాక్సాఫీస్ సెన్సేషన్.. సైరత్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..








