Cinema : బ్లాక్ బస్టర్ అంటే ఇది.. రూ.20 కోట్ల బడ్జెట్.. రూ.250 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ రికార్డ్ తిరిగరాసిన సినిమా..
రూ.20 కోట్లతో నిర్మించిన ఓ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూల్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా మూడు రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకుంది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఆ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపింది.

తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు ఇప్పుడు అత్యధిక వసూళ్లు రాబడుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన మూవీస్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల చిన్న సినిమాగా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి థియేటర్లలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వద్ద మలయాళీ సినిమాలకు వస్తున్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను జనాలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘లోకా చాప్టర్ 1’ సినిమా బడ్జెట్ కేవలం రూ.30 కోట్లు. కానీ అది 300 కోట్లు వసూలు చేసింది. అలాగే మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా దాదాపు రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ సినిమాను కేవలం రూ.20 కోట్లతో నిర్మించారు. అయితే అది ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన వ్చచింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత సంవత్సరం ఫిబ్రవరిలో విడుదలైంది. ఇందులో మలయాళీ నటులు సౌబిన్ షాయర్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో శ్రీనాథ్ బస్సీ, బాలు వర్గీస్, లాల్ జూనియర్ కీలకపాత్రలు పోషించగా.. సుశిన్ శ్యామ్ సంగీతం సమకూర్చారు.
ఒక నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం కథాంశం ఏంటంటే.. తమతో వచ్చిన స్నేహితుడి ప్రాణాలు కాపాడడం కోసం మరికొంత మంది స్నేహితులు చేసే పోరాటమే. నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లేను శిఖరాగ్రానికి తీసుకెళ్లిన సినిమా ఇళయరాజా పాట. కమల్ హాసన్ నటించిన గుణ చిత్రంలోని “కమ్మని ఈ ప్రేమలేఖనే” అనే పాట ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమా తమిళనాడులో రూ.50 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు రాబట్టిన తొలి మలయాళీ సినిమాగా నిలిచింది.
మలయాళ సినిమాలో కొత్త చరిత్ర సృష్టించిన ఈ సినిమా కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డును అందుకుంది. ఈ సినిమా దర్శకుడు చిదంబరం 3 అవార్డులను గెలుచుకున్నారు. అలాగే ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచు రెస్పాన్స్ వచ్చింది. ఇంతకీ సినిమా పేరు చెప్పలేదు కదు.. అదేనండి.. మంజుమ్మెల్ బాయ్స్. ప్రస్తుతం హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..








