Akhanda 2 : ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ.. అఖండ 2 విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. రిలీజ్ డేట్ ఇదే.. !!
నందమూరి అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమా అఖండ 2. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదల కావాల్సిన సినిమా చివరి క్షణంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. రిలీజ్ చేయడానికి కొన్ని గంటల ముందు సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పుడు బాలయ్య అభిమానులకు శుభవార్త వచ్చేసింది.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో అఖండ 2 ఒకటి. భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ సినిమా విడుదల కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరో డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో బాలయ్య నట విశ్వరూపం చూపించనున్నారని ముందు నుంచి పోస్టర్స్, టీజర్ పై బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అప్పటికే బాలయ్యతోపాటు చిత్రయూనిట్ సైతం జోరుగా ప్రమోషన్స్ నిర్వహించారు. కానీ చివరి క్షణంలో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఫైనాన్షియల్ వివాదాల కారణంగా ఈ సినిమా రిలీజ్ అగిపోయింది.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి తమకు రావాల్సిన రూ.28 కోట్ల బకాయిని చెల్లించేవరకు అఖండ 2 సినిమాను నిలిపివేయాలని బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈరోస్ వాదనలతో ఏకీభవించిన కోర్టు అఖండ2 సినిమాపై స్టే విధించింది. ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఫైనాన్షియల్ సమస్యలు అన్ని క్లియర్ అయ్యాయి. దీంతో అఖండ 2 సినిమా విడుదలకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్.
ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..
ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అఖండ 2 చిత్రాన్ని డిసెంబర్ 12న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11న రాత్రి నుంచి ప్రీమియర్ షోలు పడనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల పై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది . ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..
ఇవి కూడా చదవండి : Sairat : వాటే ఛేంజ్ అమ్మడు.. బాక్సాఫీస్ సెన్సేషన్.. సైరత్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..








