Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..
మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర, మన శంకరవరప్రసాద్ గారు వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాలు అడియన్స్ ముందుకు రానున్నాయి. అయితే ఓ సీనియర్ హీరోయిన్ చిరుతో మూడు సినిమాల్లో ఛాన్స్ రాగా.. చేయలేకపోయిందట. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్. కానీ ఆమె మెగాస్టార్ చిరంజీవితో మూడు సినిమాలు ఎందుకు చేయలేకపోయారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం.. రజనీకాంత్ సినిమాకు ఇచ్చిన కమిట్‌మెంట్ కారణంగా ఆమె చిరుతో నటించే అవకాశాలను వదులుకోవాల్సి వచ్చిందని అన్నారు. తాను ఎప్పుడు చెప్పిన టైమ్, ప్రాజెక్టులను వదులుకోలేదని.. కమిట్‌మెంట్‌లను ఎప్పుడూ బ్రేక్ చేయలేదని అన్నారు. అలాగే ఈ విషయంపై చిరంజీవికి వ్యక్తిగతంగా వివరించాలని ఉందని ఆమె అన్నారు. ఆమె మరెవరో కాదండి హీరోయిన్ గౌతమి. తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె .. చిరుతో ఒక్క సినిమా కూడా చేయలేకపోయారు. ఒకానొక సమయంలో చిరంజీవి తనపై అసంతృప్తిగా ఉన్నారని, అందుకు కారణం తాను ఆయనతో మూడు చిత్రాలకు నో చెప్పడమేనని గౌతమి తెలిపారు. రజనీకాంత్ సినిమాకు ముందుగా కమిట్ అవ్వడం వల్ల, డేట్లు క్లాష్ కావడంతో ఈ అవకాశాలను వదులుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..
ఒకసారి ఒక సినిమాకు కమిట్ అయిన తర్వాత, ఏ కారణం చేతనైనా డేట్లను మార్చడం లేదా వేరే సినిమాకు కేటాయించడం తాను ఎప్పుడూ చేయలేదని గౌతమి స్పష్టం చేశారు. మంచి చిత్రాలను కోల్పోయినా, తన వృత్తిపరమైన నిబద్ధతను ఎప్పుడూ రాజీ పడలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై చిరంజీవికి వ్యక్తిగతంగా వివరించే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నట్లు గౌతమి పేర్కొన్నారు. బాలకృష్ణతో కూడా కలిసి నటించలేదని, అయితే సౌత్ ఇండియన్ స్టార్స్‌లో చాలా మందితో పనిచేశానని ఆమె వివరించారు.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..
తనకు డాన్స్ అసలు రాదని, ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదని గౌతమి తెలిపారు. ప్లస్ టూ చదువుతున్నప్పుడు బాల అక్క అనే టీచర్ వద్ద కూచిపూడి ప్రాథమిక అంశాలను మాత్రమే నేర్చుకున్నానని తెలిపారు. పరిశ్రమలోకి వచ్చిన తర్వాత, రోజుకు 18 గంటలు సెట్స్‌లో గడిపి, ప్రతి రోజూ రెండు షిఫ్టులు పనిచేస్తూ, డాన్స్‌ను స్వయంగా నేర్చుకున్నానని ఆమె వివరించారు. రిథమ్, బాడీ మూవ్‌మెంట్స్, యాక్షన్ సీన్ల నుండి పాటల సీక్వెన్స్‌లకు ఎలా మారాలి అనే విషయాలను తన అనుభవం ద్వారా నేర్చుకున్నానని చెప్పారు. ప్రభుదేవా, రాజుసుందరం, సుందరం మాస్టర్ వంటి ప్రముఖ కొరియోగ్రాఫర్‌లు “చిక్కుబుక్కు రైలే” చిత్రం ద్వారా కొరియోగ్రఫీ శైలినే మార్చేశారని ఆమె గుర్తుచేసుకున్నారు. తాను చేస్తున్న పనిని ఎంతో ప్రేమించానని, అందుకే ఎన్ని గంటలు పని చేసినా, నిద్రలేకపోయినా, ఆహారం తీసుకోకపోయినా అలసట అనిపించేది కాదని ఆమె అన్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..








