AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తప్పుడు ప్రచారం చేసేది వాళ్లే! రిలీజ్‌కు అడ్డు తగిలేదీ వాళ్లే!

అఖండ రిలీజ్ వాయిదా ప్రకంపన టాలీవుడ్‌ను ఇప్పటికీ షేక్ చేస్తోంది. ఇండస్ట్రీకి దిష్టి తగిలిందన్న థమన్ కామెంట్ చిన్నగా చూడ్డానికి లేదు. తెలుగు సినిమాను కిందకి లాగే ప్రయత్నమేదో జరుగుతోందన్న విషయాన్ని ఆ స్టేట్‌మెంట్‌ బయటపెట్టింది. ఇదే సందర్భంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన కామెంట్‌ని పర్టిక్యులర్‌గా చూడాల్సి ఉంటుంది. టాలీవుడ్‌కు ఇప్పుడు కావాల్సింది ఐక్యత. అంతే తప్ప జోక్యం కాదు అనే సీరియస్ డైలాగ్ కొట్టారు. అంటే.. ఇండస్ట్రీలో ఐక్యత లేదనేగా అర్థం. అంతేకాదు.. బాధ్యతారహితంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలనేంత దాకా ఎందుకు వెళ్లాలి? అయినా ఎవరిపై చర్యలు తీసుకోవాలి? థమన్ అన్నట్టు సినిమాకు దిష్టిపెట్టే వారిపైననా? లేక.. ఇండస్ట్రీపై నెగిటివిటీని పెంచుతున్న వారిపైనా? లేక.. ఐక్యత లేకుండా చేస్తున్న వారిపైనా? అసలు.. ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది?

Tollywood: తప్పుడు ప్రచారం చేసేది వాళ్లే! రిలీజ్‌కు  అడ్డు తగిలేదీ వాళ్లే!
Tollywood Industry Issues
Ram Naramaneni
|

Updated on: Dec 15, 2025 | 10:10 PM

Share

అఖండ సినిమాకే అడ్డంకులు సృష్టించారంటే… సినిమా ఇండస్ట్రీ ఆరోగ్యం బాగానే ఉన్నట్టా? ఒక రోజు ముందు సినిమా రిలీజ్ ఆగడం వేరు. సినిమా టికెట్ల బుకింగ్స్ ఓపెన్ అయిన తరువాత.. ఇంకో గంటలో రిలీజ్ అవుతున్న తరుణంలో ఆగడం వేరు. చాలా సీరియస్ మ్యాటర్ అది. సో, సినీ ప్రేక్షకులకి తెలియని స్టోరీ ఏదో ఇండస్ట్రీలో నడుస్తోంది? ఏంటది? బాలకృష్ణ సినిమానే ఆపేంత వరకు వచ్చిందంటే.. రానున్న రోజుల్లో ఇంకెలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? టాలీవుడ్.. అనుకున్నంత గట్టిగా ఏమీ లేదనుకోవాలా? అఖండ-2 సినిమాపై నెగిటివిటీ నిజమే. నిర్మాత రామ్ ఆచంట అన్న ఈ మాటను సీరియస్‌గా చూడాల్సి ఉంది. రిలీజ్‌కు ముందు, రిలీజ్ తరువాత జరిగిన టోటల్ ఎపిసోడ్‌పై నిర్మాతలు చేసిన కామెంట్స్ కేవలం అఖండ మీదనే కాదు.. ఓవరాల్‌ ఇండస్ట్రీ మీద చేసినట్టు అనుకోవాలంటున్నారు. అఖండ-2 సినిమా రిలీజ్ సడన్‌గా ఆగిపోగానే.. కొందరు పనిగట్టుకుని మరీ జరిగిందేంటో తెలుసుకోకుండా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా విడుదలను పోస్ట్‌పోన్ చేయడం వెనక కారణం.. చాలా పెద్దదే. అలాగని బయటకు చెప్పేదీ కాదు. నాలుగు గోడల మధ్య జరగాల్సిన పరిష్కారం. స్వయంగా నిర్మాత సురేష్ బాబే ఈ మాట అన్నారు. సైకో సిద్ధార్థ సినిమా ఈవెంట్‌లో ఓపెన్‌గా చేసిన కామెంట్స్ ఇవి. అదొక ఫైనాన్షియల్ ఇష్యూ అని చెప్పేశారు కూడా. అన్నట్టుగానే నాలుగు గోడల మధ్యే సమస్య పరిష్కారం అయింది. ఇండస్ట్రీలోని పెద్ద నిర్మాతలు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి