Tollywood: ఆరేళ్ల ప్రేమ.. ఇద్దరు పిల్లలు.. టాలీవుడ్ హీరోయిన్‌తో పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ విలన్
ఈ ప్రేమ పక్షులు గత ఆరేళ్లుగా సహ జీవనం సాగిస్తున్నారు. వీరి ప్రేమకు ప్రతీకగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడీ లవ్ బర్డ్స్ పెళ్లితో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లెందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే తమకు నిశ్చితార్థం అయ్యిందని అధికారికంగా ప్రకటించారీ ప్రేమ పక్షులు.

బాలీవుడ్ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు అర్జున్ రాంపాల్. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచాడు హ్యాండమ్స్ విలన్. ఇటీవలే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ధురంధర్’లోనూ ఓ కీలక పాత్రలో మెరిసిన అర్జున్ రాంపాల్ ఇప్పుడు ఒక సంతోషకరమైన వార్తను పంచుకున్నాడు. సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అర్జున్ రాంపాల్ గత ఆరు సంవత్సరాలుగా ప్రముఖ నటి గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ తో డేటింగ్ చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే లేటెస్ట్ ఇంటర్వ్యూలో గాబ్రియెల్లాతో తనకు నిశ్చితార్థం జరిగిపోయిందన్న విషయాన్ని బయట పెట్టేశాడు. ఇందుకు సంబంధించి రియా షో టీజర్‌ను షేర్ చేసింది. అందులో, ఇద్దరూ తమ నిశ్చితార్థాన్ని ధృవీకరించారు. అయితే, వారు ఇంకా వివాహం చేసుకోలేదని, త్వరలోనే ఆ తంతు కూడా పూర్తి కానిస్తారని తెలుస్తోంది.
కాగా గాబ్రియెల్లా వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. సౌత్ ఆఫ్రికాలో జన్మించింది. 16 ఏళ్లకే మోడలింగ్ ప్రారంభించిన గాబ్రియెల్లా.. ఆ తర్వాత భారత్‌కు వచ్చింది. పలు మ్యూజిక్ వీడియోలు చేసింది. ఈక్రమంలోనే ‘ఇష్క్ ఝమేలా’లో అర్జున్- గాబ్రియెల్లా కలిసి నటించారు. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. కాగా తెలుగులో నాగార్జున, కార్తీ నటించిన ‘ఊపిరి’ సినిమాలో ఫ్రెంచ్ డ్యాన్సర్ జెన్నీగా అలరించింది గ్రాబియెల్లా.
ఇక అర్జున్ 1998 లో మోడల్, నిర్మాత మెహర్ జెసియాను వివాహం చేసుకున్నాడు. అయితే వారి బంధం 2018 లో ముగిసింది. ఇక 2019 నుంచే అర్జున్ గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్‌తో డేటింగ్ చేస్తున్నాడు అర్జున్. కాగా ఈ నటుడి వయసు 53 సంవత్సరాలు, గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ వయసు 38. వారి మధ్య దాదాపు 15 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. అయితే, ఇది వారి ప్రేమకు అడ్డంకి కాలేదు. వీరు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ ఎక్కడా తమ ప్రేమ బంధం గురించి అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు నిశ్చితార్థంతో తమ డేటింగ్ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు.
అర్జున్ రాంపాల్ తో గాబ్రియెల్లా..
View this post on Instagram
2001లో అర్జున్ సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్’ అతని మొదటి సినిమా. విలన్ పాత్రల ద్వారా ఆయన చాలా మంది దృష్టిని ఆకర్షించారు. ‘ఓం శాంతి ఓం’లో ఆయన పాత్రకు మంచి పేరొచ్చింది. ఇక తెలుగులో బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాలోనూ విలన్ గా నటించాడు అర్జున్. ఇక లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ ‘ధురంధర్’ సినిమాలో మేజర్ ఇక్బాల్ గా అదరగొట్టాడీ హ్యాండ్సమ్ విలన్.








