Jabardasth Emmanuel : చాలా వదులుకుని బిగ్బాస్ వరకు.. విన్నర్ కావాల్సినోడు.. ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ ఎంతంటే..
బిగ్ బాస్ సీజన్ 9.. ఇమ్మాన్యుయేల్ కారణంగానే సక్సెస్ అయ్యిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి చివరి వరకు తన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను అలరించాడు. కేవలం కమెడియన్ అంటే ఎంటర్టైనర్ మాత్రమే కాదు.. ఆల్ రౌండర్.. విన్నర్ అనేలా టాస్కులలో అదరగొట్టేశాడు. ఒకనొకా సమయంలో అత్యధిక ఓటింగ్ తో విన్నర్ రేసులో టాప్ లో దూసుకుపోయాడు.

బిగ్ బాస్ సీజన్ 9.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య కళ్యాణ్ పడాలను విజేతగా ప్రకటించారు నాగార్జున. అయితే ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో అడియన్స్ సైతం అవాక్కయ్యేలా ఊహించినది జరిగింది అంటే అది ఇమ్మాన్యుయేల్ ఎలిమినేషన్ మాత్రమే. నిజానికి ఓటింగ్ ప్రకారం ఇమ్మూ టాప్ 3లో బయటకు రావాల్సింది. కానీ ఎవరూ ఊహించని విధంగా టాప్ 4లో బయటకు వచ్చేశాడు. దీంతో అందరూ షాకయ్యారు. మరోవైపు ఇమ్మూ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు అడియన్స్. కమెడియన్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఇమ్మూ.. కమెడియన్ అంటే కేవలం కామెడీ చేయడమే కాదని.. టాస్కులలోనూ దుమ్మురేపాడు. సీజన్ మొత్తంలో అత్యధిక టాస్కులు గెలిచిన వ్యక్తి సైతం ఇమ్మూనే. అలాగే హౌస్ లో మూడు సార్లు కెప్టెన్ అయ్యాడు. పది వారాలపాటు నామినేషన్స్ లేకపోయినా.. ఎక్కువగా ఓటింగ్ తెచ్చుకున్నాడు.
ఇమ్మూ లేకపోతే ఈ సీజన్ 9 లేదు అనేట్టుగా తన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. అలాగే తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. విన్నర్ కాకపోయినా.. టాప్ 3లో ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ అసలు ఎవరూ అనుకోని విధంగా టాప్ 4లో ఎలిమినేట్ కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎలిమినేట్ తర్వాత ఇమ్మూ మాట్లాడుతూ.. బిగ్ బాస్ చాలా నేర్పించిందని.. చాలా వదులుకుని ఇక్కడికి వచ్చాను.. ఎలా ఉన్నా మనిషిలా ఉండాలని బిగ్ బాస్ నేర్పించిందని.. పేరెంట్స్ విలువ తెలిసేలా చేసిందని చెప్పుకొచ్చాడు.
ఇదెలా ఉంటే.. ఇప్పుడు ఇమ్మూ బిగ్ బాస్ రెమ్యునరేషన్ గురించి నెట్టింట టాక్ నడుస్తుంది. ఇమ్మూకు రోజుకు రూ.35 వేల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. అంటే.. వారానికి రూ.2.25 లక్షలు తీసుకున్నారని.. మొత్తం 15 వారాలకు గానూ ఏకంగా రూ.33 లక్షల 75 వేల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. విన్నర్ కావాల్సిన ఇమ్మూ.. చివరకు టాప్ 3లోనూ లేకుండా ఎలిమినేట్ కావడంపై అడియన్స్ ఫైర్ అవుతున్నారు. అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నెట్టింట సీరియస్ అవుతున్నారు.




