AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : బయట చూశాం.. వాళ్ల చరిత్ర మాకు తెలుసు.. తనూజ గురించి శ్రీసత్య, యష్మీ సంచలన కామెంట్స్..

బిగ్ బాస్ సీజన్ 9 మొదటి నుంచి విన్నర్ రేసులో వినిపిస్తున్న పేరు. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. సీరియల్ అడియన్స్, పీఆర్ టీమ్స్ నుంచి పాజిటివ్ సపోర్ట్ వస్తుండగా.. అదే స్థాయిలో తనూజకు నెగిటివిటీ సైతం వస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ శ్రీసత్య, యష్మీ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

Bigg Boss 9 Telugu : బయట చూశాం.. వాళ్ల చరిత్ర మాకు తెలుసు.. తనూజ గురించి శ్రీసత్య, యష్మీ సంచలన కామెంట్స్..
Bigg Boss 9 Telugu (20)
Rajitha Chanti
|

Updated on: Dec 20, 2025 | 7:35 AM

Share

బిగ్ బాస్ సీజన్ 9.. మరికొన్ని గంటల్లో విన్నర్ ఎవరనేది తేలబోతుంది. టాప్ 5 కంటెస్టెంట్లుగా సంజన, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల నిలిచారు. అయితే ముందు నుంచి ఈసారి సీజన్ విన్నర్ తనూజ అంటూ గట్టిగానే ప్రచారం జరుగుతుంది. కానీ తనూజకు గట్టిపోటీ ఇస్తూ దూసుకోచ్చేశాడు కళ్యాణ్ పడాల. కామనర్ గా అడుగుపెట్టి విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు కళ్యాణ్. తన వ్యూహం మార్చి టాస్కులలో అదరగొట్టి.. మాట తీరుతో జనాలను కట్టిపడేశాడు. హౌస్ లో కళ్యాణ్, తనూజ స్నేహితులుగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఇద్దరి ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్దమే జరుగుతుంది. ప్రేక్షకులతోపాటు అటు సెలబ్రెటీస్ సైతం ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ కోసం సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ కు పెద్ద ఎత్తున సపోర్ట్ లభిస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్, గౌతమ్ కృష్ణ, సోహేల్, బిందుమాధవితోపాటు.. అగ్నిపరీక్ష టీమ్ మొత్తం కళ్యాణ్ కు సపోర్ట్ ఇస్తుంది. సీరియల్ స్టార్స్ ఎక్కువగా తనూజకు మద్దతు తెలుపుతున్నారు. కానీ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ శ్రీసత్య, యష్మీ మాత్రం ఇన్ స్టా లైవ్ లో తనూజ గురించి సంచలన కామెంట్స్ చేశారు. సత్య నువ్వు ముద్ద మందారంలో యాక్ట్ చేసి కూడా ఇలా మాట్లాడుతున్నావంటే నువ్వు తనూజను చూసి కుళ్లుకుంటున్నావని అర్థమైంది అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. గట్టి కౌంటర్ ఇచ్చింది శ్రీసత్య. “బ్రో.. నువ్వు చూడనిది నేను చూశా.. అందుకే ఇలా మాట్లాడుతున్నా.. జెలసీ అయిపోవడానికి ఏముంది అక్కడ” అంటూ రియాక్ట్ అయ్యింది. ఇక యష్మీ మాట్లాడుతూ.. “జెలసీ గురించి చెప్పాలంటే మా దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి. కానీ నోరు మూసుకొని ఉన్నామంటే అది మా విజ్ఞత. ఇప్పుడు హౌస్ లో ఉన్నవాళ్లలో కొంతమందిని బయట చూశాను.. వాళ్ల చరిత్ర నాకు తెలుసు.. అందుకే మా సపోర్ట్ కళ్యాణే. అతడి బిహేవియర్ చాలా ఇష్టం ” అంటూ చెప్పుకొచ్చింది.

ఎలాంటి గేమ్ ఆడకుండా కేవలం పీఆర్ పెట్టుకోవడం వల్లే.. తనూజ ఇప్పుడు టాప్ లో ఉంది.. అలా పీఆర్ లను పెట్టుకుని తాము కూడా విన్ అయ్యేవాళ్లు. పీఆర్ కోసం అంత ఖర్చు చేసే డబ్బు మా దగ్గర లేదంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి శ్రీసత్య, యష్మీ మాత్రం కళ్యాణ్ కు గెలిపించండి అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి : Akhanda 2: అఖండ2లో బాలయ్య కూతురిగా నటించాల్సిన అమ్మాయి ఈమె కాదట.. స్టార్ హీరో కూతురు మిస్సైందిగా..

ఇవి కూడా చదవండి : Anand Movie : జస్ట్ మిస్.. ఆనంద్ సినిమాను మిస్సైన హీరోయిన్.. దెబ్బకు లైఫ్ మారిపోయేది కదా..

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?