AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu: మాస్ ఎలివేషన్స్ రా బాబూ.. కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. ప్రతి సామాన్యుడు విజిల్ కొట్టాల్సిందే..

కళ్యాణ్.. మీది ఒక సామాన్యుడి కథ.. కానీ సామాన్యమైన కథ కాదు. జీరో దగ్గర మొదలైన కథ కానీ జీరో దగ్గర ముగిసిపోని కథ. కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కోట్ల మంది ప్రేమ పొందే అవకాశం లభిస్తుంది. అగ్నిపరీక్షను దాటి మీరు సొంతం చేసుకున్నారు ఆ ప్రేమను. ఇప్పుడు ఈ స్థానంలో నిలిచి మీ ప్రయాణానికి గొప్ప అర్థాన్ని ఇచ్చారు అంటూ కళ్యాణ్ గురించి బిగ్ బాస్ చెప్పిన మాటలు జనాల గుండెల్లో పాతుకుపోయాయి.

Bigg Boss 9 Telugu: మాస్ ఎలివేషన్స్ రా బాబూ.. కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. ప్రతి సామాన్యుడు విజిల్ కొట్టాల్సిందే..
Bigg Boss 9 Telugu (19)
Rajitha Chanti
|

Updated on: Dec 20, 2025 | 7:39 AM

Share

కళ్యాణ్ పడాల.. ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి.. ఇప్పుడు విన్నర్ రేసులో ముందున్నాడు. మొదట రెండు వారాలు అసలు హౌస్ లో ఉండడం కష్టమే అనుకున్న కంటెస్టెంట్.. ఇప్పుడు ఏకంగా టైటిల్ కు అడుగు దూరంలో ఉన్నాడు. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది తెలియనుంది. ఈ క్రమంలోనే గత రెండు మూడు రోజులుగా హౌస్ లో టాప్5 కంటెస్టెంట్స్ జర్నీ వీడియోలను ప్లే చేసి చూపిస్తున్నాడు బిగ్ బాస్. అందులో భాగంగానే తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్ జర్నీ వీడియోలను చూపించగా.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం కళ్యాణ్ పడాల, సంజన జర్నీ వీడియోలను చూపించారు. ముఖ్యంగా కళ్యాణ్ పడాల జర్నీ వీడియో మాత్రం అదిరిపోయింది. ఆ ఎలివేషన్స్ చూస్తే అడియన్స్ విజిల్స్ కొట్టాల్సిందే అన్నట్లుగా ఎడిట్ చేశారు.

దీంతో కళ్యాణ్ విన్నర్ బాసూ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కళ్యాణ్ గురించి బిగ్ బాస్ చెప్పిన ఒక్కో మాట జనాలను కట్టిపడేశాయి. “కళ్యాణ్.. మీది ఒక సామాన్యుడి కథ.. కానీ సామాన్యమైన కథ కాదు. జీరో దగ్గర మొదలైన కథ కానీ జీరో దగ్గర ముగిసిపోని కథ. కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కోట్ల మంది ప్రేమ పొందే అవకాశం లభిస్తుంది. అగ్నిపరీక్షను దాటి మీరు సొంతం చేసుకున్నారు ఆ ప్రేమను. ఇప్పుడు ఈ స్థానంలో నిలిచి మీ ప్రయాణానికి గొప్ప అర్థాన్ని ఇచ్చారు. ఎన్నో కఠినమైన అగ్నిపరీక్షలను మీ ముందుకు వచ్చినా.. వాటిని దాటి మీ వ్యక్తిత్వాన్ని నిరూపిస్తే కానీ ముందుకు కదలలేని పరిస్థితుల్లో మీకు ఒకరి స్నేహం బాసటగా నిలిచింది. మీ తప్పు ఒప్పులను స్పష్టంగా మీకు తెలిసేలా చేసింది. మీలో ధైర్యాన్ని నింపింది. వారి కోసం ఎలాంటి త్యాగాలనైనా అలవోకగా చేయగలిగే బంధం ఏర్పడింది.

మిమ్మల్ని కుంగదీసిన పరిస్థితుల నుంచి తేరుకున్నారు. తప్పులను సరిచేసుకుని మీ వ్యూహాలను సరైన సమయంలో అమలు చేశారు. సరైన దిశలో నడవడమే విజయాన్ని అందించే మార్గమని చూపించారు. బుద్ధి బలాన్ని భుజ బలాన్ని మించిన గుండె బలం. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసిని ఒక్కోవారం నింపుకుంటూ కెప్టెన్ గా నిలిచారు. లక్ష్మణ్ రావ్ లక్ష్మిల కొడుకు కళ్యాణ్ అనే మాట ఇప్పటివరకూ.. కానీ వీళ్లు కళ్యాణ్ తల్లిదండ్రులు అనే గౌరవాన్ని కాలర్ ఎగరేసే గర్వాన్ని ఇప్పుడు వారికి మీరు అందించారు.. ఎంతో మంది కామనర్స్ కు స్పూర్తిగా నిలిచారు” అంటూ కళ్యాణ్ గురించి భారీ ఎలివేషన్స్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక కళ్యాణ్ జర్నీ వీడియో మాత్రం అదిరిపోయింది. అందులో కళ్యాణ్ ఆట, మాటతోపాటు బీఎమ్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మొత్తానికి కళ్యాణ్ బిగ్ బాస్ విన్నర్ అనేలా వీడియోను ఎడిట్ చేశారు.

ఇవి కూడా చదవండి : Anand Movie : జస్ట్ మిస్.. ఆనంద్ సినిమాను మిస్సైన హీరోయిన్.. దెబ్బకు లైఫ్ మారిపోయేది కదా..

ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల