Bigg Boss 9 Telugu : బిగ్బాస్ విజేతగా కళ్యాణ్ పడాల.. ప్రైజ్ మనీతోపాటు ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా.. ?
నరాలు తెగే ఉత్కంఠకు తెర పడింది. మొత్తానికి ఈ సీజన్ 9 విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు కళ్యాణ్ పడాల. కామనర్ గా ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ ఫైనలిస్ట్ గా అరుదరైన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు విన్నర్ గా నిలిచాడు. ఇంతకీ కళ్యాణ్ పారితోషికం ఎంతో తెలుసా.. ?

బిగ్బాస్ సీజన్ 9.. ఎట్టకేలకు విన్నర్ ఎవరనేది తెలిసిదే. గత వారం రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న ఈ సీజన్ 9 విజేతగా నిలిచి కామనర్ గా కప్పు గెలిచాడు కళ్యాణ్. టైటిల్ విన్నర్ గా సామాన్యుడు కప్పు అందుకున్నాడు. వేలాది మందిని దాటుకుని 15 మందిలో ఒకడిగా అగ్నిపరీక్షలోకి అడుగుపెట్టాడు. తన ఆట తీరుతో అడియన్స్ మెప్పు పొంది ఫస్ట్ కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టాడు. కానీ మొదటి మూడు వారాలు ఆట పక్కన పెట్టి.. జనాలకే విసుగు పుట్టించాడు. కానీ నాలుగో వారం నుంచి వ్యూహం మార్చి ఒక్కసారిగా తన ఆట తీరుతో కట్టిపడేశాడు. రోజు రోజుకీ ఆట తీరు మార్చుకుని తన మాటలతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్నాడు. అంతేకాదు..ప్రతి టాస్కులో అదరగొట్టాడు.. తన మాటలతో జెన్యూన్ ప్లేయర్ గా నిలిచి.. మొదటి నుంచి విన్నర్ రేసులో దూసుకుపోతున్న తనూజకే గట్టిపోటీ ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : తనూజ చెవిలో శ్రీముఖి ఏం చెప్పింది.. ? ఏం లీక్ చేసింది భయ్యా.. నెటిజన్స్ ఆగ్రహం…
బిగ్ బాస్ హౌస్ తోపాటు అడియన్స్ మనసు గెలుచుకున్న కళ్యాణ్ విజేతగా నిలిచి ట్రోఫీని అందుకున్నాడు. ఇక కళ్యాణ్ బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీతోపాటు రెమ్యునరేషన్ వివరాలు తెలుసుకుందాం. తెలుగు బిగ్ బాస్ విన్నర్ కు 50 లక్షల ప్రైజ్ మనీ.. అందులో డీమాన్ పవన్ రూ.15 లక్షలు తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. దీంతో ప్రైజ్ మనీ 35 లక్షలకు తగ్గిపోయింది. అలాగే కళ్యాణ్ వారానికి రూ.2 లక్షల వరకు తీసుకున్నట్లు టాక్. దీంతో మొత్తం 15 వారాలకు గానూ రూ. 30 లక్షల పారితోషికం తీసుకున్నట్లు టాక్. ప్రైజ్ మనీ 35 లక్షలు, రెమ్యునరేషన్ 30 లక్షలు కలిపి 65 లక్షల వరకూ కళ్యాణ్ పడాల అందుకున్నట్లు టాక్. వీటితోపాటు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కు మారుతీ సుజూకీ కారు బహుమతిగా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 55 ఏళ్ల వయసులోనూ ఒంటరిగా.. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్..
ఏపీలోని విజయనగరానికి చెందిన కళ్యాణ్ పడాల… కష్టపడి చదివి ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. మూడేళ్లు సైనికుడిగా సేవలు అందించాడు. కానీ చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తి.. ఇష్టం.. అతడిని బిగ్ బాస్ వైపు అడుగులు వేసేలా చేసింది. వేలాది మందిని దాటుకుని అగ్నిపరీక్షలో అడుగుపెట్టి ఫస్ట్ కామనర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు బిగ్ బాస్ విజేతగా నిలిచాడు.
ఇవి కూడా చదవండి : Actress : మూడు సినిమాలతోనే ఇండస్ట్రీనికి షేక్ చేసింది.. బతికి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేది.. కానీ ప్రియుడి మోసంతో..




