Bigg Boss 9 Telugu : తనూజ చెవిలో శ్రీముఖి ఏం చెప్పింది.. ? ఏం లీక్ చేసింది భయ్యా.. నెటిజన్స్ ఆగ్రహం…
బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి నుంచి అటు పాజిటివ్.. ఇటు నెగిటివిటీ రెండూ కలిగి ఉంది తనూజ. బీబీ టీమ్ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండగా.. అదేం లేదంటూ పీఆర్ టీమ్ కొట్టిపారేసింది. ఇప్పుడు మరో వీడియోను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు అడియన్స్. అందులో తనూజ చెవిలో శ్రీముఖి ఏదో చెబుతూ కనిపించింది.

బిగ్ బాస్ సీజన్ 9.. విన్నర్ ఎవరో తెలియడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే సంజన, ఇమ్మాన్యుయేల్ సైతం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల, తనూజ టాప్ 3లో ఉన్నారు. వీరిలో కళ్యాణ్, తనూజ.. ఇద్దరిలోనే విన్నర్ ఉండనున్నారని సమాచారం. అయితే ఇప్పుడు విజేత్ ఎవరు అవుతారా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. నిజానికి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ పై ఇమ్మాన్యూయేల్, తనూజ, కళ్యాణ్ మధ్య కాస్త గట్టిగానే పోటీ నడిచింది. కానీ ఇప్పుడు కనీసం మూడో స్థానంలో కాకుండా ఇమ్మూ నాలుగో కంటెస్టెంట్ గా ఎలిమినేట్ కావడంతో అటు అడియన్స్, ఇటు ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ షేర్ చేస్తున్నారు అడియన్స్. ముఖ్యంగా బీబీ టీమ్ ఫేవరిజం అంటూ మండిపడుతున్నారు. ఆ వీడియోలో ఏముందంటే.. తనూజను హగ్ చేసుకుని శ్రీముఖి చెవిలో ఏదో చెప్పింది. ఆ సమయంలో సాంగ్ ప్లే అవుతుండగా.. మైక్ సౌండ్ సైతం కట్ చేశారు. దీంతో శ్రీముఖి తనూజకు ఏం చెప్పిందనేది తెలియలేదు. ఇప్పుడు అదే వీడియోను చేస్తున్నారు కళ్యాణ్ ఫ్యాన్స్. ఇప్పటికీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఫేవరిజం చూపిస్తున్న వీడియో క్లియర్ గా కనిపిస్తుందని.. శ్రీముఖి మాట్లాడుతుంటే మైక్ ఎందుకు కట్ చేశారని.. అసలు శ్రీముఖి తనూజ చెవిలో ఏం చెప్పించారు ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Actress : స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై.. ఇప్పుడు 400 కోట్ల ఇంట్లో ఆ హీరోయిన్..
ఇన్నాళ్లు కన్ఫెషన్ రూమ్ హింట్స్, సెలబ్రెటీ హింట్స్ సరిపోలేదా.. ఒక్క రోజు ముందు కూడా హింట్స్ ఇస్తున్నారని పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ శ్రీముఖి తనూజ చెవిలో ఏం చెప్పింది.. ? విన్నర్ ఎవరనేది లీక్ చేసిందా.. ? లేదా క్యాజువల్ గా మాట్లాడిందా అనేది తెలియరాలేదు. కానీ అటు నెటిజన్స్.. ఇటు కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియోను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది.
Clear Favourism towards BB Management Bidda🤬Mic enduku cut chesav ra,Em Cheppi pampav ra @StarMaa@JioHotstarTel_😭🤧Inni weeks confession room hints, celebrities hints saripoka finale ki before day kuda infos vellali MB ki👌👍👏#BiggBossTelugu9pic.twitter.com/Ihr43h0tWv
— 🙂 (@Mounika073) December 20, 2025
ఇవి కూడా చదవండి : Cinema: వార్నీ.. ఈ క్రేజీ హీరోయిన్ ఈ విలన్ భార్యానా.. ? తెలుగులో స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు..




