Cinema: వార్నీ.. ఈ క్రేజీ హీరోయిన్ ఈ విలన్ భార్యానా.. ? తెలుగులో స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు..
ప్రస్తుతం చాలా మంది విలన్స్ తెలుగులో అలరిస్తున్నారు. ముఖ్యంగా ఇతర భాషలకు చెందిన నటులు తమ పవర్ ఫుల్ నటనతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ ఆ విలన్స్ మాత్రం అందమైన హీరోయిన్లను పెళ్లి చేసుకున్నారు. ఓవైపు భార్యలు హీరోయిన్లుగా రాణిస్తుంటే.. భర్తలు మాత్రం విలన్ పాత్రలతో పాపులర్ అవుతున్నారు.

సాధారణంగా సినిమాల్లో విలన్ పాత్రలతో పాపులర్ అయిన నటులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో జాన్ కొక్కెన్ ఒకరు. ఇప్పుడిప్పుడే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు. కానీ ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలు పోషిస్తున్నారు. డాన్ శీను, తీన్ మార్, 1 నేనొక్కడినే, బాహుబలి, జనతా గ్యారేజ్, వెంకీమామ, కేజీఎఫ్ చాప్టర్ 1, వీరసింహారెడ్డి వంటి సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం తెలుగులో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే మీకు తెలుసా.. ఈ నటుడి భార్య మాత్రం తెలుగులో క్రేజీ హీరోయిన్. అవును.. అతడు ఓ హీరోయిన్ ను ప్రేమించి పెళ్ల చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి : Dhurandhar: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ధురంధర్.. ఈ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో తోపు హీరోయిన్..
ఆమె పేరు పూజా రామచంద్రన్. తెలుగులో హీరోయిన్. అలాగే బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్. స్వామిరారా సినిమాతో పూజకు తెలుగులో గుర్తింపు వచ్చింది. అలాగే దోచేయ్, గంగ, కృష్ణార్జున, యుద్ధం, త్రిపుర, కాంచన 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతోపాటు గ్లామర్ లుక్స్ లో కట్టిపడేసింది. పూజా రామచంద్రన్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే 2010లో విజె క్రేప్గ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు.
ఇవి కూడా చదవండి : Anand Movie : జస్ట్ మిస్.. ఆనంద్ సినిమాను మిస్సైన హీరోయిన్.. దెబ్బకు లైఫ్ మారిపోయేది కదా..
ఆ తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టింది. కొన్నాళ్లకు జాన్ కొక్కెన్ తో ప్రేమలో పడిన పూజా.. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు బాబు ఉన్నాడు. అతడి పేరు కియాన్ కొక్కెన్. ప్రస్తుతం పూజా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ జాన్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : డీమాన్ దెబ్బకు మారిన ఓటింగ్.. ఆఖరి రోజు ఊహించని రిజల్ట్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Akhanda 2: అఖండ2లో బాలయ్య కూతురిగా నటించాల్సిన అమ్మాయి ఈమె కాదట.. స్టార్ హీరో కూతురు మిస్సైందిగా..




