- Telugu News Photo Gallery Cinema photos Guess This Actress In This Photo, She Is Top Heroine In 90s, Her Name Is Shobana
Actress : చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 55 ఏళ్ల వయసులోనూ ఒంటరిగా.. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్..
సాధారణంగా సినీతారలకు సంబంధించిన పర్సనల్ విషయాలు నిత్యం సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. ఈమధ్యకాలంలో తారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అలాగే పలువురు హీరోయిన్స్ చైల్డ్ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకప్పుడు కుర్రవాళ్ల ఆరాధ్య దేవత.
Updated on: Dec 20, 2025 | 2:18 PM

సినీతారలు తమ లైఫ్ స్టైల్, పాత జ్ఞాపకాలను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకుంటారు. ఇప్పుడు సౌత్ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా హృదయాలను దోచుకుంటోంది. అది మరెవరో కాదు శోభన.

ఈ ఫోటోను శోభన అభిమానులు నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. దక్షిణాది సినిమా చరిత్రలో అందరికంటే ఇష్టమైన తార. ఎనభైలు, తొంభైలలో అనేక చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అప్పట్లో ఆమె స్టార్ హీరోయిన్.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న శోభన.. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ యాక్టివ్ గా ఉంటుంది.

ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చిన శోభన.. అటు తన డ్యాన్స్ క్లాసులపై శ్రద్ధ వహిస్తుంది. చాలా కాలంగా ఆమె సొంతంగా శాస్త్రీయ నృత్య శిక్షణ శిభిరాన్ని స్టార్ట్ చేసి..చాలా మంది చిన్నారులకు నాట్యం నేర్పిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సైతం పంచుకుంటుంది.

అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన డ్యాన్స్ స్కూల్ ఫోటోస్, వీడియోస్ పంచుకుంటుంది. తాజాగా శోభనకు సంబంధించిన త్రోబ్యాక్ పిక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.




