- Telugu News Photo Gallery Cinema photos Do you remember the heroine in this challenge role look, She is Manju Warrier
ఈ ఛాలెంజింగ్ రోల్‌లో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫెమస్ గురూ..
చాలా మంది ముద్దుగుమ్మలు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా చేస్తున్నారు. ఇక పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తుపట్టారా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తుంది. ఆమె వీడియోనే కనిపిస్తుంది.
Updated on: Dec 20, 2025 | 9:03 PM

చాలా మంది ముద్దుగుమ్మలు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా చేస్తున్నారు. ఇక పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తుపట్టారా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తుంది. ఆమె వీడియోనే కనిపిస్తుంది.

తన అందంతో ప్రేక్షకులను కవ్విస్తుంది ఆ బ్యూటీ. అలాగే నటనతోనూ ఈ అమ్మడు తోపే.. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.? ఆమె కేవలం నటి మాత్రమే కాదు నిర్మాత కూడా.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఆమె. ఎవరో గుర్తుపట్టారా.? అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె..

పై ఫొటోలో ఉన్న నటి ఎవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ మంజు వారియర్. తన 16వ ఏట 1995లో సాక్ష్యం అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. మలయాళ ఇండస్ట్రీలో ఆమె ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఎన్నో పురస్కారాలు కూడా అందుకుంది. ఏ పళయుం కదన్ను సినిమాలోని నటనకుగానూ మంజు కేరళ రాష్ట్ర ఉత్తమ సినీ నటి పురస్కారం లభించింది.

ఆ తరువాత ఆమె వరసగా నాలుగు సార్లు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది మంజు. ఇక పై ఫోటో ఆమె నటించిన అసురన్ సినిమాలోది. ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలో ఆమె అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో ధనుష్ భార్యగా కనిపించింది మంజు.

వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొన్నామధ్య ఈ అమ్మడు సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న వెట్టయన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నుంచి విడుదలైన ఓ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ లో మంజు తన స్టెప్పులతో ఆకట్టుకుంది.